
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌లో పర్యటించే భారత మహిళల జట్లను శుక్రవారం ఎంపిక చేశారు. హేమలత కళ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రెండు జట్లను ప్రకటించింది. సారథులుగా వన్డేలకు మిథాలీరాజ్‌ను, టి20లకు హర్మన్‌ప్రీత్ కౌర్‌ను కొనసాగించింది. అయితే ఇరుజట్ల నుంచి వేద కృష్ణమూర్తిని తొలగించారు. ఫామ్ లో లేకపోవడంతో ఆమెను కివీస్ టూర్‌కు ఉద్వాసన పలికారు. ఆమె స్థానంలో వన్డే జట్టులోకి మోనా మేష్రమ్, టి20లో కొత్తమ్మాయి ప్రియా పూనియాను ఎంపిక చేశారు. పూజ వస్త్రకర్ గాయపడటంతో టి20 జట్టులో ఆమె స్థానాన్ని శిఖాపాండేతో భర్తీ చేశారు. జనవరి 24 నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో భారత మహిళల జట్టు మూడు వన్డేలు, మూడు టి20లు ఆడుతుంది. టి20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఓడిన తర్వాత భారత్ ఆడనున్న తొలి సిరీస్ ఇది. గురువారం అమ్మాయిల జట్టు కోచ్‌గా
డబ్ల్యూవీ రామన్‌ను నియమించిన సంగతి తెలిసిందే.
వన్డే జట్టు: మిథాలీరాజ్ (కెప్టెన్), పూనమ్ రౌత్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తిశర్మ, తానియా భాటియా, మోనా మేష్రమ్, ఏక్తాబిష్త్, మాన్సి జోషి, హే మలత, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, జులన్ గోస్వామి, శిఖాపాండే.
టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి, మిథాలీ, దీప్తి, జెమీమా, అనూజ, హేమలత, మాన్సి, శిఖా పాండే, తానియా, పూనమ్, ఏక్తా బిష్త్, రాధ, అరుంధతి రెడ్డి, ప్రియాపూనియా.