మండలి చీఫ్‌విప్‌ ‘పాతూరి’కి సన్మానం | Honor to paturi sudhakarreddy | Sakshi
Sakshi News home page

మండలి చీఫ్‌విప్‌ ‘పాతూరి’కి సన్మానం

Published Tue, Sep 6 2016 10:44 PM | Last Updated on Thu, Jul 11 2019 5:33 PM

Honor to paturi sudhakarreddy

కరీంనగర్‌ : శాసనమండలి చీఫ్‌విప్‌గా ఎంపికై మొదటిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా పాతూరి సుధాకర్‌రెడ్డిని మంగళవారం ఘనంగా సన్మానించారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. సుధాకర్‌రెడ్డి మొదటి నుంచి ప్రజల మనిషి అని, మండలిలో స్వపక్ష సభ్యుడైనప్పటికీ విపక్ష పాత్ర పోషిస్తాడని చమత్కరించారు. సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించడమే తన లక్ష్యమని, పదవులు వస్తే ప్రశ్నించలేమనే సందేహాలు వద్దని అన్నారు. పీఆర్‌సీ బకాయిల విడుదల, సర్వీస్‌రూల్స్, భాషా పండితుల అప్‌గ్రేడేషన్‌ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, పీఆర్‌టీయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాతూరి రాజిరెడ్డి, చోల్లేటి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గోనే శ్రీనివాస్, బాలసంకుల అనంతరావు, తిరుపతిరెడ్డితో పాటు డిప్యూటీ ఈఓ కట్టా ఆనందం పాల్గొన్నారు. అనంతరం సుధాకర్‌రెడ్డిని గజమాలలతో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, జూనియర్, డిగ్రీ లెక్చరర్ల సంఘం, మోడల్‌ స్కూల్‌ అసోసియేషన్, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సన్మానించారు. 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement