sudhakarreddy
-
సుధాకర్‌రెడ్డిని నేనే బయటకు తీసుకొచ్చా: సతీష్ రెడ్డి
కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న రాగిపిండి సుధాకరరెడ్డిని తానే బయటకు తీసుకొచ్చానని పులివెందుల టీడీపీ అభ్యర్థి ఎస్.వి.సతీష్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సతీష్‌రెడ్డి, సుధాకరరెడ్డి ఆరోపణలెదుర్కొంటున్న సంగతి తెల్సిందే. శుక్రవారం ఓ చానెల్లో జరిగిన చర్చలో పాల్గొన్న సతీష్ రెడ్డి ఈ మేరకు వెల్లడించారు. చంద్రబాబును ప్రాధేయపడి, పలుమార్లు విజ్ఞప్తులు చేసి సుధాకరరెడ్డిని బయటకు తీసుకొచ్చానని సతీష్‌రెడ్డి వెల్లడించారు. అంతేకాదు వివేకానంద రెడ్డి హత్య గురించి తెలిసిన వెంటనే తాను శుక్రవారం ఉదయం డీజీపీ ఠాకూర్‌కు ఫోన్ చేశానని సతీష్‌రెడ్డి బయటపెట్టారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరినట్లు ఆయన తెలిపారు. -
రాజేష్ మాటలు నమ్మి భర్తను చంపుకున్నా: స్వాతి
సాక్షి, నాగర్‌కర్నూల్: నాతో జీవితాంతం తోడుగా ఉంటానని రాజేష్ చెప్పాడు.. అతని మాటలు నమ్మి తన భర్త సుధాకర్‌రెడ్డిని చంపుకున్నానని సుధాకర్ రెడ్డి భార్య స్వాతి పోలీసులకు తెలిపింది. ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసిన కేసులో అరెస్టయిన స్వాతిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసుల ప్రశ్నలకు ఆమె పై విధంగా సమాధానమిచ్చింది. అయితే ప్రియుడు రాజేష్‌పై యాసిడ్ దాడి ఎలా జరిగిందన్న ప్రశ్నకు ఆమె సమాధానమివ్వలేదు. కాగా, ప్రియుడిపై యాసిడ్ దాడి, భర్త హత్య గురించి స్వాతి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. -
స్వాతి ప్రోత్సాహంతోనే హత్య
సాక్షి, నాగర్‌కర్నూల్/నాగర్‌కర్నూల్ క్రైం: కాంట్రాక్టర్ సుధాకర్‌రెడ్డితో తనకు పరిచయంగానీ, శత్రుత్వంగానీ ఏమీ లేదని హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజేశ్ చెప్పాడు. కేవలం అతని భార్య స్వాతి ప్రోత్సాహంతోనే తాను హత్య చేసినట్లు పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. సంచలనం సృష్టించిన సుధాకర్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాజేశ్‌ను గురువారం నాగర్‌కర్నూల్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ఈ కేసులో స్వాతిని రెండు రోజుల క్రితం రిమాండ్‌కు పంపిన విషయం విదితమే. రాజేశ్‌ను పోలీసులు రోజంతా విచారించారు. ఘటనాస్థలికి తీసుకెళ్లి పలు వివరాలు రాబట్టినట్లు సమాచారం. పారిపోదామంటే.. స్వాతికి సుధాకర్ రెడ్డి అంటే ఇష్టం లేదని, ఆమె ఒత్తిడి, ప్రోద్బలంతోనే పథకం ప్రకారం అతడిని హతమార్చామని రాజేశ్ హైదరాబాద్‌లో మీడియా తో చెప్పాడు. పోలీసుల విచారణలో రాజేశ్ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. మూడు నెలల క్రితం ఎక్కడికైనా పారిపోదామని స్వాతిని రాజేశ్ కోరగా పిల్లలు, తల్లిదండ్రులను వదిలి రాలేనని చెప్పింది. గత నెల 26న స్వాతి, రాజేశ్ కలసి తిరగడాన్ని సుధాకర్‌రెడ్డి చూశాక వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అదేరోజు రాత్రి సుధాకర్‌రెడ్డిని చంపాలని స్వాతి పథకం పన్నింది. దీంతో మత్తు ఇంజక్షన్ ఇచ్చి స్పృహ తప్పేలా చేసింది. 27న తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో తలపై రాడ్‌తో బాది హత్య చేశారు. రాజేశ్‌ను డ్రైవర్‌గా ఇంటి యజమానికి స్వాతి పరిచయం చేసింది. తాము ఈ నేరం నుంచి ఎలా తప్పించుకోవాలన్న దానిపై చర్చించారు. సుధాకర్‌రెడ్డి స్థానంలో రాజేశ్ ఉండేలా స్వాతి ప్లాస్టిక్ సర్జరీ ఆలోచన చెప్పగా.. ముఖానికి కొన్ని రసాయనాలు పూసుకుని స్వాతి చున్నీపై పెట్రోల్ వేసుకుని రాజేశ్ ముఖాన్ని కాల్చుకున్నాడు. మరో కారు అద్దెకు తీసుకుని హైదరాబాద్ వెళ్లారు. అదే సమయంలో సుధాకర్‌రెడ్డిపై యాసిడ్ దాడి జరిగిందని స్వాతి బంధువులకు ఫోన్లో తెలిపింది. కాగా, హత్య కేసులో రాజేశ్ వాడిన రాడ్‌ను, మత్తు ఇంజక్షన్ల సిరంజీలను, రాజేశ్ తల వెంట్రుకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, మత్తు ఇంజక్షన్ సరఫరా చేసినట్లుగా భావిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేశ్‌ను శుక్రవారం రిమాండ్‌కు పంపనున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాతి.. ఖైదీ నంబర్ 687 మహబూబ్‌నగర్ క్రైం: నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ సుధాకర్‌రెడ్డి హత్య కేసులో నిందితురాలైన ఆయన భార్య స్వాతికి జైలులో అధికారులు 687 నంబర్ కేటాయించారు. 13 మంది ఖైదీలతో పాటు లాకప్‌లో ఆమెను ఉంచారు. జైలులో ఎలాంటి ఆందోళన లేకుండా గడిపినట్లు సమాచారం. ఉదయం పూట యోగా చేసిన స్వాతి.. అనంతరం జైలులోని నిరక్షరాస్యులకు అక్షరాలు దిద్దించినట్లు తెలిసింది. -
కన్నార్పకుండా సూర్యుడి వంక..
అనంతపురం సప్తగిరి సర్కిల్ : నెల్లూరు జిల్లా చిలంకూరుకు చెందిన సుధాకర్‌రెడ్డి అరగంటపైగా కన్ను ఆర్పకుండా సూర్యుని వంక చూస్తూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. మంగళవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన సూర్యుడ్ని రెప్పను కొట్టకుండా చూస్తూ తనకున్న ప్రత్యేకమైన స్వభావాన్ని గురించి వివరించాడు. తాను ధర్మ గంగేశ్వర ఆలయం నిర్మించేందుకు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు పర్యటించానన్నారు. తాను ఎవరినీ యాచించడం లేదని వారి తృప్తితో వారే ముందుకు వచ్చి ఇచ్చిన దానితో సంతృప్తి పడుతున్నానని తెలిపాడు. -
మండలి చీఫ్‌విప్ ‘పాతూరి’కి సన్మానం
కరీంనగర్ : శాసనమండలి చీఫ్‌విప్‌గా ఎంపికై మొదటిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా పాతూరి సుధాకర్‌రెడ్డిని మంగళవారం ఘనంగా సన్మానించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. సుధాకర్‌రెడ్డి మొదటి నుంచి ప్రజల మనిషి అని, మండలిలో స్వపక్ష సభ్యుడైనప్పటికీ విపక్ష పాత్ర పోషిస్తాడని చమత్కరించారు. సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించడమే తన లక్ష్యమని, పదవులు వస్తే ప్రశ్నించలేమనే సందేహాలు వద్దని అన్నారు. పీఆర్సీ బకాయిల విడుదల, సర్వీస్‌రూల్స్, భాషా పండితుల అప్‌గ్రేడేషన్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, పీఆర్టీయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాతూరి రాజిరెడ్డి, చోల్లేటి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గోనే శ్రీనివాస్, బాలసంకుల అనంతరావు, తిరుపతిరెడ్డితో పాటు డిప్యూటీ ఈఓ కట్టా ఆనందం పాల్గొన్నారు. అనంతరం సుధాకర్‌రెడ్డిని గజమాలలతో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, జూనియర్, డిగ్రీ లెక్చరర్ల సంఘం, మోడల్ స్కూల్ అసోసియేషన్, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ఉద్యోగులు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సన్మానించారు.