
సాక్షి, నాగర్‌కర్నూల్: నాతో జీవితాంతం తోడుగా ఉంటానని రాజేష్ చెప్పాడు.. అతని మాటలు నమ్మి తన భర్త సుధాకర్‌రెడ్డిని చంపుకున్నానని సుధాకర్ రెడ్డి భార్య స్వాతి పోలీసులకు తెలిపింది. ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసిన కేసులో అరెస్టయిన స్వాతిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ సందర్భంగా పోలీసుల ప్రశ్నలకు ఆమె పై విధంగా సమాధానమిచ్చింది. అయితే ప్రియుడు రాజేష్‌పై యాసిడ్ దాడి ఎలా జరిగిందన్న ప్రశ్నకు ఆమె సమాధానమివ్వలేదు. కాగా, ప్రియుడిపై యాసిడ్ దాడి, భర్త హత్య గురించి స్వాతి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment