రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా బీఎస్ యడ్యూరప్ప నియమితులైన సందర్భంగా ఆదివారం ..
సింధనూరు టౌన్ : రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా బీఎస్ యడ్యూరప్ప నియమితులైన సందర్భంగా ఆదివారం బెంగళూరులోని ఆయన నివాసంలో కొప్పళ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈసందర్భంగా కొప్పళ లోక్‌సభ సభ్యుడు కరడి సంగణ్ణ, మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప, మాజీ ఎమ్మెల్యే పరణ్ణ మునవళ్లి, ఎన్.శంక్రప్ప, ప్రముఖులు కొల్లా శేషగిరిరావు, జెడ్పీ సభ్యుడు అమరేగౌడ విరుపాపుర, వెంకనగౌడ మల్కాపుర, ఆర్.బసనగౌడ తుర్విహాళ, చంద్రశేఖర్, ఎం.రంగనగౌడ, మధ్వరాజాచార్, యువ నాయకుడు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.