నెల్లూరు (రవాణా): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన పలువురు మహిళలను ఆదివారం ప్రభుత్వం సత్కరించింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కనుపర్తిపాడులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన రాష్ట్ర మహిళా సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా రంగాల్లో ఉత్తమ సేవలందించిన ప్రముఖ మహిళలను సీఎం శాలువాతో సత్కరించారు.
సత్కారం పొందిన వారు...
1. జయా ఫిలిప్స్ (అనాథలకు చేయూత), 2. చెన్నుపాటి విద్య (అనాథలకు చేయూత), 3. డి.సుశీల (మహిళల అభివృద్ధి), 4. రోజిలిన్ (మహిళల అభివృద్ధి), 5. షావుకారు జానకి (సినీనటి), 6. ఎల్.ఆర్.ఈశ్వరి (గాయని), 7. సునీత (గాయని), 8. ఓల్గా (రచయిత్రి), 9. విజయలక్ష్మి (నాటకరంగం), 10. లలితాదాస్ (అంతర్జాతీయ పెయింటర్), 11. లలితా కామేశ్వరి (నేత్రావధానం), 12. రమాకుమారి (నేత్రావధానం), 13. శైలజాకిరణ్ (వ్యాపార రంగం), 14. విజయదుర్గ(న్యూస్‌రీడర్ ), 15. నల్లాని ఈశ్వరి(పేద విద్యార్థులకు చేయూత), 16. హారిక (చెస్ క్రీడాకారిణి).
ప్రముఖ మహిళలకు సీఎం సత్కారం
Published Mon, Mar 9 2015 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 10:31 PM
Advertisement
Advertisement