సాగులో ప్రతిభకు సత్కారం
- ఇద్దరు రైతుకు రాష్ట్రస్థాయి రైతు రత్న అవార్డులు
- సీఎం చేతులు మీదుగా విజయవాడలో ప్రదానం
కర్నూలు(అగ్రికల్చర్)/మహానంది: జిల్లాకు చెందిన ఇద్దరు రైతులు వ్యవసాయంలో అద్భుత ప్రతిభ కనబరిచి సీఎం చంద్రబాబునాయుడు చేతులు మీదుగా రాష్ట్రస్థాయి రైతు రత్న అవార్డు అందుకున్నారు. ఇందులో మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన రమణయ్య వరి పంట సాగు చేసి ఎకరాకు 59 బస్తాల దిగుబడి సాధించగా పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన సయ్యద్ అహ్మద్‌బాషా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 1.5 ఎకరా పొలంలో సాగు చేసిన పచ్చిమిరప నుంచి రూ. 31 వేల పెట్టుబడితో ఆరు కోతల్లో రూ.1.42 లక్షల రాబడి సాధించారు. శుక్రవారం విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి సంక్రాంతి సంబరాల్లో వీరిద్దరిని రూ. 15వేల నగదు పురస్కారం, మెమొంటో, ప్రశంస పత్రాలతో సీఎం సత్కరించారు.