
మిస్టర్ వరల్డ్‌కు ఘన సత్కారం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: మిస్టర్ వరల్డ్ రోహిత్ కన్‌డెల్‌వాల్‌ను చిక్కడపల్లి అరోరా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఆర్టీసీ కళ్యాణ మండపంలో గురువారం ఘనంగా సత్కరించారు. ఆయన ఈ కళాశాల పూర్వ విద్యార్థి కావడం గమనార్హం. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, ఏసీపీ జె.నర్సయ్య, కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ విశ్వనాథం బులుసు, రోహిత్ అన్న రాహుల్ తదితరులు పాల్గొన్నారు.