
హువాయ్‌కి చెందిన టెర్మినల్ బ్రాండు హానర్ గురువారం తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. హానర్ హోలీ 4 ప్లస్ పేరుతో దీన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అక్టోబర్‌లో లాంచ్ చేసిన హానర్ హోలీ 4కి ఇది అప్‌గ్రేడెడ్ వెర్షన్. ఈ ఫోన్ ధర 13,999 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. శుక్రవారం నుంచి అన్ని హానర్ పార్టనర్ స్టోర్లలో ఇది విక్రయానికి రానుంది. యంగ్ యూజర్లను టార్గెట్‌గా చేసుకుని ఇది మార్కెట్‌లోకి వచ్చింది.
హానర్ హోలీ 4 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు...
మెటల్ బాడీ
5.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 435 ఎస్‌ఓసీ
3జీబీ ర్యామ్
32జీబీ ఆన్‌బోర్డు స్టోరేజ్
128జీబీ వరకు విస్తరణ మెమరీ
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
గ్రే, గోల్డ్, సిల్వర్ రంగుల్లో అందుబాటు
Comments
Please login to add a commentAdd a comment