తెయూలో ఘనంగా గురుపూజోత్సవం
తెయూ(డిచ్‌పల్లి):
తెలంగాణ యూనివర్సిటీలో ప్రేరణ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా గురు పూజోత్సవం నిర్వహించారు. తెయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాలలో విద్యార్థులు అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. అంతకు ముందు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాథాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రిన్సిపల్ సత్యనారాయణచారి, అధ్యాపకులు అంజనేయులు, కైసర్ మహ్మద్, అపర్ణ, వాణి లను విద్యార్థులు సత్కరించారు. విద్యార్థి నాయకులు సంతోష్ నాయక్, రాజు, ఉదయ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.