హవాయి..హానర్ బ్రాండ్
న్యూఢిల్లీ: చైనాలో 2017 సంవత్సరానికి గానూ ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండుగా హువాయి హానర్ నిలించింది. దాదాపు 55 మిలియన్ పరికరాలను(మొబైల్స్, టాబ్లెట్స్) విక్రయించి, 12 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసిందని మార్కెట్ పరిశోధన సంస్థ సినో-మార్కెట్ రీసెర్చ్ తెలిపింది. అమ్మకాల ఆదాయంలో పోటీదారు షావోమిని హానర్ అధిగమించింది. కృత్రిమ మేథస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో విడుదలైన హానర్ వ్యూ10 మొబైల్ సంచలనమే సృష్టించింది. విడుదలైన ఒక్క నవంబర్ నెలలో 400-650 డాలర్ల ధరల శ్రేణిలో 10 శాతానికి పైగా వాటాని చేజిక్కించుకుంది.
అలాగే హానర్ ఎక్స్ సిరీస్‌లోని హానర్ 4ఎక్స్, హానర్ 7ఎక్స్ మొబైళ్లు కూడా మంచి అమ్మకాలు సాధించాయి. ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్ మొబైళ్లు అమ్ముడు పోయాయి. గత సంవత్సరం నవంబర్ 11న చైనాలో సింగిల్ డే సేల్స్‌లో భాగంగా 160-320 డాలర్ల ధరల శ్రేణిలో హానర్ 7ఎక్స్ టాప్‌లో నిలిచింది. ఇండియాలో కూడా 20 వేల యూనిట్ల అమ్మకాలు ఒక్క గంటలో నమోదయ్యాయని మార్కెట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. క్వాడ్-లెన్స్ సిస్టమ్‌తో హవాయి సంస్థ ఈ నెల ఆరంభంలో హానర్ 9 లైట్‌ని ఇండియాలో విడుదల చేసిన సంగతి తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment