
లెనవూ కొత్త ల్యాప్‌టాప్‌లు..
చైనీస్ కంప్యూటర్ తయారీ సంస్థ లెనవూ తాజాగా సరికొత్త ల్యాప్‌టాప్, ఆల్‌ఇన్‌వన్ పీసీలను భారత్ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. వీటిల్లో లెనవూ జీ40/50 ఎంట్రీలెవెల్ ల్యాప్‌టాప్.
కొత్త సరకు
చైనీస్ కంప్యూటర్ తయారీ సంస్థ లెనవూ తాజాగా సరికొత్త ల్యాప్‌టాప్, ఆల్‌ఇన్‌వన్ పీసీలను భారత్ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. వీటిల్లో లెనవూ జీ40/50 ఎంట్రీలెవెల్ ల్యాప్‌టాప్. ఇందుకు తగ్గట్టుగానే వీటిల్లో ఇంటెల్ కోర్ ఐ3, లేదా ఏఎండీ ఏ8 బీమా ప్రాసెసర్లు ఉంటాయి. గ్రాఫిక్స్ కోసం 2జీబీ ఎన్‌విడియా జీఈఫోర్స్ జీటీ820ఎం ప్రాసెసర్‌ను, జీ50లో జీటీ840ఎం ప్రాసెసర్‌ను ఉపయోగించింది. స్క్రీన్‌సైజు 14, 15.6 అంగుళాలు. రెండింటిలోనూ 16 జీబీ డీడీఆర్3ఎల్ ర్యామ్, ఒక టెరాబైట్ హార్డ్‌డిస్క్‌లు ఉన్నాయి. అవసరమైతే ఒక టెరాబైట్ హైబ్రిడ్ డ్రైవ్‌ను ఎంచుకోవచ్చు. వీటి ధర రూ.22,900 వరకూ ఉండవచ్చు.
ఇక మధ్యమశ్రేణిలో లెనవూ జెడ్50 పేరుతో మరో ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.దీని స్క్రీన్‌సైజు 15.6 అంగుళాలు. రెండు గిగాహెర్ట్జ్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఎనిమిది గిగాబైట్ల డీడీఆర్3ఎల్ ర్యామ్, ఒక టెరాబైట్ హార్డ్‌డిస్క్/ 500 జీబీ హైబ్రిడ్ డిస్క్‌ల ఆప్షన్స్ ఉన్నాయి. జీ40/జీ50, జెడ్ 50ల బ్యాటరీలు నాలుగు నుంచి 5 గంటలపాటు పనిచేస్తాయని కంపెనీ చెబుతోంది.
ఇక సీ260 ఆల్ ఇన్‌వన్ పీసీ విషయం చూద్దాం. దాదాపు 20 అంగుళాల స్క్రీన్‌సైజుతో వచ్చే ఈ పీసీలో 2.41 గిగాహెర్ట్జ్ క్లాక్‌స్పీడ్‌తో పనిచేసే ఇంటెల్ పెంటియమ్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ర్యామ్ 8 జీబీ, హర్డ్‌డిస్క్ సామర్థ్యం ఒక టెరాబైట్. ఇవికాకుండా లెనవూ కొత్తగా రూ.60వేలు విలువ చేసే యోగా -2 కన్వర్టిబుల్‌ను, రూ.42 వేల ఖరీదు చేసే ఫ్లెక్స్-2ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ పీసీలు, ల్యాప్‌టాప్‌లన్నీ విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తాయి.