లెనోవా కొత్త ల్యాప్‌టాప్‌: టూ ఇన్‌ వన్‌ | Lenovo 2-in-1 glass convertible laptop launched in India | Sakshi
Sakshi News home page

లెనోవా కొత్త ల్యాప్‌టాప్‌: టూ ఇన్‌ వన్‌

Published Tue, Jan 23 2018 2:46 PM | Last Updated on Tue, Jan 23 2018 2:51 PM

Lenovo 2-in-1 glass convertible laptop launched in India  - Sakshi

సాక్షి, బెంగళూరు: చైనాకు చెందిన బహుళజాతి టెక్నాలజీ కంపెనీ లెనోవా  కొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది.  'యోగా 920’  లిమిటెడ్ ఎడిషన్ వైబ్స్‌​  కన్వర్టిబుల్ ల్యాప్‌టాప్‌ను మంగళవారం లాంచ్‌ చేసింది. దీని ధరను  రూ .1,27,150 గా నిర్ణయించింది. దీన్ని ల్యాప్‌ టాప్ మోడ్, టాబ్లెట్ మోడ్, స్టాండ్ మోడ్ , టెంట్ మోడ్‌ ఇలా 2-ఇన్ -1 గా దీన్ని వాడుకోవచ‍్చని కంపెనీ చెప్పింది.

కన్వర్టిబుల్‌ పీసీ కేటగిరీలో లెనోవా యోగా ‍ బ్రాండ్‌ లీడర్‌గా కొనసగుతోందని లెనోవా  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ​ తాడాని వెల్లడించారు.  తమ తాజా ఆవిష్కరణ  యోగా 920 అల్ట్రా ప్రీమియం మోడల్‌ అని తెలిపారు.  2ఇన్ వన్‌ గ్లాస్‌ కన్వర్టిబుల్ పరికరంలో డిజిటల్ పిన్‌, ఫార్-ఫీల్డ్‌ టెక్నాలజీని జోడించినట్టు చెప్పారు. దీని వలన వినియోగదారులు నాలుగు మీటర్ల దూరంలో ఉన్నా, స్టాండ్‌ బై మోడ్‌లో ఉన్నా వాయిస్-యాక్టివేటెడ్  ఇంటిలిజెన్స్‌ అసిస్టెంట్‌ కోర్టానా ను యాక్టివేట్‌ చేసేకోచ్చని తెలిపారు.  కంపెనీ వినియోగదారుల పోర్ట్‌ఫోలియోలో 2ఎక్స్‌ థండర్‌ బోల్టులు కలిగిన మొదటి డివైస్‌అని ప్రకటించారు.

 4కే టచ్‌స్ర్కీన్‌ డిస్‌ ప్లే, 8వ జనరేషన్‌ ఇంటెల్‌ క్వాడ్ కోర్ యు-సిరీస్ ప్రాసెసర్స్‌ విత్‌ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్, ట్విన్ థండర్‌ బోర్డ్‌ యూఎస్‌బీ టైప్-సి పోర్టు,  డాల్బీ అట్మోస్‌ టెక్నాలజీ జెబీఎల్‌  స్పీకర్లు ,ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి.  ప్లాటినం కలర్‌లో ఆల్‌ మెటల్‌బాడీ డిజైన్‌తో వస్తున్న ఈ ల్యాప్‌టాప్‌ విండోస్‌ 10ఆపరేటింగ్‌ సిస్టం ఆధారితం.  విండోస్‌ హెల్లోకి సపోర్ట్‌ చేస్తుంది.  అలాగే ఫింగర్‌ ప్రింట్‌ రీడర్‌ కూడా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement