అతిపెద్ద డిస్ ప్లేతో లెనొవో స్మార్ట్ ఫోన్ | Lenovo launches Phab 2 Plus at Rs 14,999 in India | Sakshi
Sakshi News home page

అతిపెద్ద డిస్ ప్లేతో లెనొవో స్మార్ట్ ఫోన్

Published Tue, Nov 8 2016 1:37 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

అతిపెద్ద డిస్ ప్లేతో లెనొవో స్మార్ట్ ఫోన్ - Sakshi

అతిపెద్ద డిస్ ప్లేతో లెనొవో స్మార్ట్ ఫోన్

న్యూఢిల్లీ: చైనా మొబైల్ తయారీ సంస్థ లెనొవో కొత్తగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. 'ఫాబ్ 2 ప్లస్' పేరుతో మంగళవారం కొత్త స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది. అతిపెద్ద తెర కలిగివుండడం ఈ ఫోన్ ప్రత్యేకత. అత్యధిక డేటా వాడే వారి కోసం 6.4 ఫుల్ హెచ్ డీ డిస్ ప్లేతో దీన్ని రూపొందించింది. అమెజాన్ వెబ్ సైట్ లో మాత్రమే ఈ ఫోన్ లభ్యమవుతుంది. 

'ఫాబ్ 2 ప్లస్' స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు సరికొత్త అనుభూతి ఇస్తుందని లెనొవో ఇండియా కన్జుమర్, డిజిటల్ మార్కెటింగ్ హెడ్ అమిత్ దోషీ తెలిపారు. ఫింగర్ ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మోస్ ఆడియో టెక్నాలజీ, ఫొటోలు మరింత స్పష్టంగా వచ్చేందుకు అవసరమైన ఆధునిక ఫీచర్లు పొందుపరిచినట్టు వెల్లడించారు. డేటా భద్రత కోసం మెక్ ఆఫీ, నెట్ ఫ్లిక్స్, స్విఫ్ట్ కీ సాఫ్ట్ వేర్స్ పెట్టామని చెప్పారు.

లెనోవా ఫాబ్ 2 ప్లస్ ఫీచర్లు
4050 ఎంఏహెచ్ బ్యాటరీ
1.8 జీహెచ్ జడ్ ట్రూ 8 కోర్ మీడియా టెక్ ప్రాసెసర్
3 జీబీ ర్యామ్
32 ఇంటర్నల్ మెమరీ
128 జీబీ ఎక్స్ పాండబుల్ మెమరీ
13 ఎంపీ రియర్ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్
ధర రూ. 14,999

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement