
మోటోరోలా - లెనోవో ఫోన్లు
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్, లెనోవో, మెటోరోలా 4జీ స్మార్ట్‌ఫోన్లపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ కంపెనీలకు చెందిన ఎంపిక చేసిన 4జీ స్మార్ట్‌ఫోన్లపై 2వేల రూపాయల వరకుక్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్టు తెలిపింది. పాపులర్ మోడల్స్ అయిన మోటొరోలా మోటో సీ, మోటో ఈ4, లెనోవో కే8 నోట్ ఫోన్లపై ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఆఫర్‌లో భాగంగా మోటో సీ స్మార్ట్‌ఫోన్ రూ.3,999కే లభ్యంకానుంది. అలాగే మోటో ఈ4 స్మార్ట్‌ఫోన్ 6,499 రూపాయలకి, లెనోవో కే8 నోట్ స్మార్ట్‌ఫోన్ 10,999 రూపాయలకి కంపెనీ అందుబాటులో ఉంచుతుంది.
4జీ స్మార్ట్‌ఫోన్లను మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు మోటోరోలాతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామని భారతీ ఎయిర్‌టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వాని వెంకటేశ్ తెలిపారు. '' ఎయిర్‌టెల్ కస్టమర్లు 4జీ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అయ్యేందుకు ఇది మంచి అవకాశం. మోటోరోలా, లెనోవో స్మార్ట్‌ఫోన్లతో ఈ అనుభవాన్ని ఎంజాయ్ చెయ్యండి'' అని మోటోరోలా మొబిలిటీ ఇండియా, లెనోవో ఎంబీజీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుధిన్ మాథుర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment