ప్రపంచపు అతి పలుచని కన్వర్టబుల్ ల్యాప్‌టాప్! | Yoga 900S, Lenovo, Windows 10 operating system, Convertible Laptop | Sakshi
Sakshi News home page

ప్రపంచపు అతి పలుచని కన్వర్టబుల్ ల్యాప్‌టాప్!

Published Wed, Jan 6 2016 6:13 AM | Last Updated on Wed, May 29 2019 2:58 PM

ప్రపంచపు అతి పలుచని కన్వర్టబుల్ ల్యాప్‌టాప్! - Sakshi

ప్రపంచపు అతి పలుచని కన్వర్టబుల్ ల్యాప్‌టాప్!

‘యోగా 900ఎస్’ను  ఆవిష్కరించిన లెనొవొ
న్యూఢిల్లీ: చైనా టెక్నాలజీ దిగ్గజ కంపెనీ లెనొవొ తాజాగా తన యోగా సిరీస్‌లోనే ప్రపంచపు అతి పలుచనైన (12.8 మిల్లీమీటర్లు) కన్వర్టబుల్ ల్యాప్‌టాప్ ‘యోగా 900ఎస్’తో సహా పలు ఉత్పత్తులను మార్కెట్‌లో ఆవిష్కరించింది. ‘యోగా 900ఎస్’లో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, తక్కువ బరువు (999 గ్రాములు), 10.5 గంటల వీడియో ప్లేబ్యాక్, డాల్బీ ఆడియోను అందించే ఇంటెల్ కోర్ ఎం7 ప్రాసెసర్, క్రిస్టల్ క్లియర్ రిజల్యూషన్‌ను అందించే క్యూహెచ్‌డీ స్క్రీన్ (2,560x1,440) వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

వీటితోపాటు లెనొవొ కంపెనీ ఐడియాప్యాడ్ వై900, ఐడియాసెంటర్ వై900 ఆర్‌ఈ, లెనొవొ వై27జీ అండ్ వై27జీ ఆర్‌ఈ కర్వ్‌డ్ గేమింగ్ మానిటర్స్, ఐడియాసెంటర్ 610ఎస్, ఐడియాప్యాడ్ 700, 710ఎస్ వంటి తదితర ఉత్పత్తులను మార్కెట్‌లో ఆవిష్కరించింది. కంపెనీ ఈ ఉత్పత్తులన్నింటినీ జనవరి 6 నుంచి 4 రోజులపా టు లాస్‌ఏంజిలిస్‌లో జరగనున్న ‘ఇంటర్నేషనల్ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షో’లో ప్రదర్శించనున్నది.
 
కొత్త స్మార్ట్‌ఫోన్స్ కూడా...
లెనొవొ కంపెనీ ‘వైబ్ ఎస్1 లైట్’, ‘వైబ్ కే4 నోట్’ అనే రెండు స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లో ఆవిష్కరించింది. ‘వైబ్ ఎస్1 లైట్’లో 5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 2,700 ఎంఏహెచ్ బ్యాటరీ, 1.3 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4జీ, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 13 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక ‘వైబ్ కే4 నోట్’ స్మార్ట్‌ఫోన్‌లో 5.5 అంగుళాల తెర, 3 జీబీ ర్యామ్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. దీని ధర రూ.11,999. వైబ్ కే4 నోట్ స్మార్ట్‌ఫోన్ల ఫ్లాష్ సేల్స్ జనవరి 19 నుంచి అమెజాన్‌లో ప్రారంభమౌతాయని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement