10 లక్షల ఫోటోలను, 2000 హెచ్‌డీ మూవీలను ఒక స్మార్ట్‌ఫోన్‌లో స్టోర్ చేసుకోవచ్చా అంటే, నిజంగా అసాధ్యం అనేస్తారు. ఇప్పుడున్న ఫోన్లలో అంత స్టోరేజ్ ఎక్కడుందని ఠక్కున ప్రశ్నిస్తారు. కానీ త్వరలోనే అంత ఎక్కువ స్టోరేజ్ సామర్థ్యంతో కూడా ఓ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలోకి వచ్చేస్తోందట. 4 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో లెనోవో నుంచి ఓ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతుందని తెలిసింది. మీరు విన్నది నిజమే. ఈ విషయాన్ని లెనోవో వైస్ ప్రెసిడెంట్ ఛాంగ్ ఛెంగ్ చైనీస్ సోషల్ నెటివర్కింగ్ వెబ్‌సైట్ వైబో ద్వారా తెలియజేశారు. లెనోవో నుంచి తర్వాత రాబోతున్న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అత్యధిక మొత్తంలో 4 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉందని టీజ్ చేశారు.
ఇంత ఎక్కువ మొత్తంలో స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ స్టోరేజ్ కెపాసిటీతో స్మార్ట్‌ఫోన్‌లో 2000 హెచ్‌డీ మూవీలు, 1,50,000 లూస్‌లెస్ మ్యూజిక్ ఫైల్స్, 10 లక్షల ఫోటోలను స్టోర్ చేసుకోవచ్చని ఛెంగ్ తెలిపారు. ఇప్పటికే ఈ డివైజ్ లెనోవో జెడ్ 5గా ధృవీకరణ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ తొలుత చైనాలో లాంచ్ కాబోతుంది. త్వరలోనే భారత్‌కు కూడా రానున్నట్టు తెలుస్తోంది. ప్రాక్టికల్ టెక్నాలజీతో ఇది రూపొందుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు వెనుక వైపు ఎలక్ట్రిక్ బ్లూ బాడీ ఉండనుంది. ఛెంగ్ రివీల్‌చేసిన ఇమేజ్‌లో ఇది పూర్తిగా బెజెల్-లెస్ స్మార్ట్‌ఫోన్ అని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment