Moto M
-
'మోటో ఎం' స్మార్ట్ ఫోన్ లాంచింగ్ నేడే
ముంబై: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ లెనోవో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మంగళవారం లాంచ్ చేయనుంది. లెనోవా సొంతమైన మోటో.. ఇండియాలో మొట్టమొదటి ఆల్ -మెటల్ ఫోన్ ను ప్రారంభించనుంది. మోటో ఎం పేరుతో తీసుకొస్తున్న ఈ కొత్త డివైస్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది. ముంబైలో జరిగే ఒక కార్యక్రమంలో ఈ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఇప్పటికే చైనాలో ఈ లాంచ్ అయిన మోటో ఎం ధర సుమారు రూ. 20వేలుగా ఉండనుంది. మోటో ఎం ఫీచర్లు: ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే,1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, మాలి టి860 ఎంపీ2 గ్రాఫిక్స్ 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్ 4జీ వీవోఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్ 3050 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్ ఆండ్రాయిడ్ 6.0.1 మార్షమిల్లౌ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. -
ఆ రెండు ఫోన్ల లాంచింగ్ నవంబర్ 8నే!
మోటోరోలా కొత్త స్మార్ట్‌ఫోన్ డివైజ్ రూపకల్పనలో నిమగ్నమై ఉందని ఇప్పటికే పలు రిపోర్టులు నివేదించాయి. దాని పేరు మోటో ఎమ్ అని, ఆ ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉండబోతున్నాయంటూ ఆన్లైన్లో హల్చల్ చేశాయి. రియర్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌తో రాబోతున్న ఈ ఫోన్ లాంచింగ్ నవంబర్ 8న జరుగబోతుందని, దీంతో పాటు లెనోవా వైబ్ పీ2 స్మార్ట్‌ఫోన్ కూడా లాంచ్ అవుతుందని తాజా రిపోర్టుల బట్టి తెలుస్తోంది. వైబ్ పీ1 విజయం సాధించడంతో, వైబ్ పీ2ను లెనోవా ఆవిష్కరిస్తుందని టెక్డ్రాయిడర్ తెలిపింది. ఆండ్రాయిడ్ సోల్ ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లను పోస్టు చేసింది. లెనోవా వైబ్ పీ2 ఫీచర్లు 5100 ఎంఏహెచ్ బ్యాటరీ 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ 3జీబీ ర్యామ్+32జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 4జీబీ ర్యామ్+32జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 13 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ముందు వైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్ ఇక మోటోరోలా మోటో ఎమ్ ఫీచర్లను పరిశీలిస్తే... 5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 2.1 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6755 ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్ 32జీబీ ఇంటర్నెల్ మెమరీ 3,000ఎంఏహెచ్ బ్యాటరీ 16 ఎంపీ ప్రైమరీ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా