మోటో ఎక్స్.. 32 జీబీ వేరియంట్ | Motorola Moto X (2nd Gen) 32GB now available in India | Sakshi
Sakshi News home page

మోటో ఎక్స్.. 32 జీబీ వేరియంట్

Published Tue, Dec 23 2014 12:20 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

మోటో ఎక్స్.. 32 జీబీ వేరియంట్ - Sakshi

మోటో ఎక్స్.. 32 జీబీ వేరియంట్

ధర రూ. 32,999
ఫ్లిప్‌కార్ట్ ద్వారా లభ్యం

 
న్యూఢిల్లీ: మోటొరోలా మొబిలిటీ సంస్థ మోటో ఎక్స్ సెకండ్ జనరేషన్ ఫోన్‌లో 32 జీబీ వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చని, ధర రూ.32,999 అని కంపెనీ పేర్కొంది. దీంట్లో వుడ్ ఫినిష్, లెదర్ జాకెట్‌తో కూడిన మోడల్ ధర రూ.34,999 అని వివరించింది. ఈ మోడల్‌లో 16 జీబీ వేరియంట్ ధరను రూ.2,000 తగ్గించి రూ.29,999కే అందిస్తున్నామని తెలిపింది. 16 జీబీ వేరియంట్‌లో కూడా వుడ్ ఫినిష్, లెదర్ జాకెట్‌తో కూడిన మోడల్‌ను అందిస్తున్నామని, ధర రూ.31,999 అని పేర్కొంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్...
ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే మోటో ఎక్స్ సెకండ్ జనరేషన్ ఫోన్‌ను ఆండ్రాయిడ్ లాలిపాప్ ఓఎస్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
 
ఈ ఫోన్‌లో 5.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే, 2.5 గిగా హెర్ట్జ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించింది.  

క్రిస్మస్ సందర్భంగా ఎక్స్ఛేంజ్  ఆఫర్ ను ఇస్తున్నామని పేర్కొంది. వినియోగదారులు ఎవరైనా తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చని, మోడల్‌ను బట్టి పాత స్మార్ట్‌ఫోన్‌కు వినియోగదారులు రూ.6,000 పొందవచ్చని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement