టెక్నాలజీ కంపెనీ మోటరోలా ఆఫ్‌లైన్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ కంపెనీ మోటరోలా ఆఫ్‌లైన్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. తొలి రిటైల్ స్టోర్ ‘మోటో షాప్’ను యూఎస్‌లోని చికాగో నగరంలో శనివారం ప్రారంభిస్తోంది. ‘స్మార్ట్‌ఫోన్స్, వేరబుల్స్‌ను శక్తివంతమైన టెక్నాలజీతో రూపొందించాం. నిజ జీవితంలో స్టోర్‌కు వెళ్లి, వాటిని ప్రత్యక్షంగా చూసి అనుభూతి చెందాల్సిందే. షాపింగ్ అనుభూతి మరింత వ్యక్తిగతంగా మలిచాం’ అని కంపెనీ తన బ్లాగ్‌లో పేర్కొంది. ఇతర గ్యాడ్జెట్ స్టోర్లకు భిన్నంగా మోటో షాప్‌ను తీర్చిదిద్దారు. ఉపకరణాల తయారీలో వాడిన విడిభాగాలన్నీ స్టోర్‌లోని మోటో మేకర్ టూల్‌లో అందుబాటులో ఉంటాయి.