వెల్లింగ్టన్: దుకాణాల్లో వస్తువులు దొంగలించిందన్న ఆరోపణలపై న్యూజిలాండ్ మహిళా ఎంపీ గోలిజ్ గ్రాహమన్ తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆక్లాండ్, వెల్లింగ్టన్ నగరాల్లోని బొటిక్, షాపింగ్‌మాల్‌లో మూడు సార్లు దొంగతనానికి పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. షాపింగ్‌మాల్‌లో అత్యంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్, డ్రెస్‌ను ఆమె దొంగలిస్తున్న సీసీటీవీ ఫుటేజీలు బహిర్గతం కావడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.
పోలీసు దర్యాప్తు కొనసాగుతుండటంతో గోలిజ్ తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన చర్యకు బేషరతు క్షమాపణలు చెప్పారు. గతంలో ఆమె మానవహక్కుల కేసులు వాదించే లాయర్‌గా పేరు తెచ్చుకున్నారు. తర్వాత రాజకీయాల్లో చేరి గ్రీన్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. ఇరాన్ నుంచి వలసవచ్చి 2017 సంవత్సరంలో న్యూజిలాండ్‌లో ఎంపీ అయిన తొలి వలస వ్యక్తిగా రికార్డులకెక్కారు.
Comments
Please login to add a commentAdd a comment