న్యూఢిల్లీ: వేగవంతమైన చార్జింగ్ సదుపాయం, అత్యాధునిక కెమెరా టెక్నాలజీ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా మార్కెట్‌లో ఆవిష్కరించింది. ‘మోటో జీ6 ప్లస్’ పేరిట సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్.. 6జీబీ ర్యామ్, 64 అంతర్గత మెమరీ, 5.9 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు మోటరోలా వెల్లడించింది.
వెనుకవైపు 12, 5 మెగాపిక్సెల్ డ్యుయల్ కెమెరాలు, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ లెన్స్ అనుసంధానించటం వల్ల ఫొటోల్లో మరింత స్పష్టత, ల్యాండ్‌మార్క్ గుర్తింపు నాణ్యత ఉంటుందని వివరించింది. 3,200 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ, టర్బోవపర్ చార్జర్ ఉన్న ఈ ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుందని తెలిపింది. ప్రారంభ ఆఫర్ కింద పేటీఎం మాల్, మోటో హబ్, అమెజాన్‌లో పలు ఆఫర్లను ఇస్తున్నట్లు లెనోవో అనుబంధ సంస్థ మోటొరోలా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment