మోటో జడ్ ఫోన్ ఫీచర్లు ఇవే...
శాన్ ఫ్రాన్సిస్కో : మోటోరోలా నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. శాన్ ఫ్రాన్సిస్కో ఈవెంట్ గా మోటో జడ్, మోటో జడ్ ఫోర్స్ స్మార్ట్ ఫోన్లను గురువారం రాత్రి మోటోరోలా ప్రవేశపెట్టింది. హై ఎండ్ ఫోన్లగా వీటిని తీసుకొచ్చింది. మోటో జడ్ ను సెప్టెంబర్ తర్వాతి నుంచి గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది. మొదట అమెరికాలో అమ్మకాలు నిర్వహించాక, అనంతరం గ్లోబల్ మార్కెట్లో తీసుకొస్తామని తెలిపింది. అయితే ఈ ఫోన్ ధరను మాత్రం ప్రకటించలేదు.
మోటో జడ్ ఫోర్స్ ను ఎక్స్ క్లూజివ్ గా అమెరికాలో అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొంది. కానీ దాన్ని ధరను కూడా తెలుపలేదు. మొత్తం మెటల్ బాడీ, ప్యూర్ ఆండ్రాయిడ్ తో పనిచేయడం, వాటర్ రిపెలెంట్ కోటింగ్, మోడ్యులర్ డిజైన్ ఈ ఫోన్ల స్పెషల్ ఫీచర్లు. మోటో జడ్ చాలా థిన్ డిజైన్ ను కలిగి ఉండగా.. మోటో జడ్ ఫోర్స్ షట్టర్ ఫ్రూప్ స్క్రీన్ కలిగిఉంది. ఇప్పటివరకూ రిలీజ్ అయిన థినెస్ట్, పవర్ ఫుల్ ఫోన్లలో మోటో జడ్ ఒకటిగా ఉంది. మోటో జడ్, మోటో జడ్ ఫోర్స్ స్మార్ట్ ఫోన్లు 16 మోటో మోడ్స్ తో వచ్చాయి. ఈ మోడ్స్ వల్ల మరింత శక్తివంతమైన కెమెరా లేదా స్టీరియో వంటి కొత్త సామర్థ్యాలను ఫోన్లకు జోడించవచ్చు.
మోటో జడ్ ఫోన్ ఫీచర్లు...
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్
4జీబీ తక్కువ పవర్ డీడీఆర్4 ర్యామ్
32, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లు
2టీబీ మైక్రోఎస్డీ కార్డు
5.5 అంగుళాల స్క్రీన్
13 మెగాపిక్సెల్ ముందు కెమెరా
5 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
136 గ్రాములు
ఆండ్రాయిడ్ 6 అకా మార్ష్ మాలో
2600 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ టర్బో చార్జింగ్
మోటో జడ్ ఫోర్స్ స్పెషల్ ఫీచర్లు..
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్
4జీబీ తక్కువ పవర్ డీడీఆర్4 ర్యామ్
32, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లు
2టీబీ మైక్రోఎస్డీ కార్డు
5.5 అంగుళాల స్క్రీన్, షట్టర్ ఫ్రూప్ స్క్రీన్ ను ఈ ఫోన్ కలిగిఉంది.
21 మెగాపిక్సెల్ ముందు కెమెరా
5 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
163 గ్రాములు
ఆండ్రాయిడ్ 6 అకా మార్ష్ మాలో
3500 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ టర్బో చార్జింగ్