మార్కెట్లోకి మోటో-జడ్ ఫోన్లు, ఫీచర్లు ఇవే | Moto Z, Moto Z Play smartphones arrive in India | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి మోటో-జడ్ ఫోన్లు, ఫీచర్లు ఇవే

Published Tue, Oct 4 2016 7:43 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

మార్కెట్లోకి మోటో-జడ్ ఫోన్లు, ఫీచర్లు ఇవే

మార్కెట్లోకి మోటో-జడ్ ఫోన్లు, ఫీచర్లు ఇవే

దిగ్గజ కంపెనీ మోటోరోలా మంగళవారం రెండు కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మోడళ్లను భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

దిగ్గజ కంపెనీ మోటోరోలా మంగళవారం రెండు కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మోడళ్లను భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మోటో జడ్, మోటో జడ్ ప్లేలను ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించింది. ఈ నెల 17నుంచి ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఈ కామర్స్ స్టోర్లలో రెండు మోడళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
 
ఈ మోడళ్ల ఫోన్ల కోసం మోటోరోలా ప్రత్యేకంగా మోటో మోడ్స్ పేరుతో మొబైల్ బ్యాక్ ప్యానళ్లను విడుదల చేసింది. ఈ ప్యానళ్లలో జేబీఎల్ స్పీకర్లు, జూమ్ కెమెరా, ప్రొజెక్టర్, ఇన్సిపియో ఆఫ్ గ్రిడ్ పవర్ ప్యాక్ లను ఉంచింది. వీటితో సంబంధం లేకుండా వివిధ మోడళ్లలో ప్యానళ్లను తెచ్చింది.
 
మోటో జడ్ ఫీచర్లు
5.5 ఇంచ్ ల క్వాడ్ హెచ్ డీ అమోలెడ్ స్క్రీన్
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్
ర్యామ్: 4జీబీ
రీర్ కెమెరా: 13 మెగా పిక్సల్స్
ఫ్రంట్ కెమెరా: 5 మెగా పిక్సల్స్
బ్యాటరీ: 2,600ఎంఏహెచ్
64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 2టీబీ వరకూ ఎక్సటర్నల్ మెమరీని పొడిగించుకునేందుకు అవకాశం ఉంది.
 
మోటో జడ్ ప్లే
5.5 ఇంచ్ ల ఫుల్-హెచ్ డీ సూపర్ అమోలెడ్ స్ర్కీన్
2 జీహెచ్ జీ ఆక్టా కోర్ ప్రాసెసర్
ర్యామ్: 3జీబీ
బ్యాటరీ: 3,510ఎంఏహెచ్, టర్బో పవర్ చార్జింగ్
రీర్ కెమెరా: 16 మెగా పిక్సల్స్
ఫ్రంట్ కెమెరా: 5 మెగా పిక్సల్స్
కాగా, మోటో జడ్ ధర రూ.39,999లు, మోటో జడ్ ప్లే రూ.24,999లుగా కంపెనీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement