మార్కెట్లోకి మోటో-జడ్ ఫోన్లు, ఫీచర్లు ఇవే
దిగ్గజ కంపెనీ మోటోరోలా మంగళవారం రెండు కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మోడళ్లను భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మోటో జడ్, మోటో జడ్ ప్లేలను ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించింది. ఈ నెల 17నుంచి ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఈ కామర్స్ స్టోర్లలో రెండు మోడళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
ఈ మోడళ్ల ఫోన్ల కోసం మోటోరోలా ప్రత్యేకంగా మోటో మోడ్స్ పేరుతో మొబైల్ బ్యాక్ ప్యానళ్లను విడుదల చేసింది. ఈ ప్యానళ్లలో జేబీఎల్ స్పీకర్లు, జూమ్ కెమెరా, ప్రొజెక్టర్, ఇన్సిపియో ఆఫ్ గ్రిడ్ పవర్ ప్యాక్ లను ఉంచింది. వీటితో సంబంధం లేకుండా వివిధ మోడళ్లలో ప్యానళ్లను తెచ్చింది.
మోటో జడ్ ఫీచర్లు
5.5 ఇంచ్ ల క్వాడ్ హెచ్ డీ అమోలెడ్ స్క్రీన్
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్
ర్యామ్: 4జీబీ
రీర్ కెమెరా: 13 మెగా పిక్సల్స్
ఫ్రంట్ కెమెరా: 5 మెగా పిక్సల్స్
బ్యాటరీ: 2,600ఎంఏహెచ్
64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 2టీబీ వరకూ ఎక్సటర్నల్ మెమరీని పొడిగించుకునేందుకు అవకాశం ఉంది.
మోటో జడ్ ప్లే
5.5 ఇంచ్ ల ఫుల్-హెచ్ డీ సూపర్ అమోలెడ్ స్ర్కీన్
2 జీహెచ్ జీ ఆక్టా కోర్ ప్రాసెసర్
ర్యామ్: 3జీబీ
బ్యాటరీ: 3,510ఎంఏహెచ్, టర్బో పవర్ చార్జింగ్
రీర్ కెమెరా: 16 మెగా పిక్సల్స్
ఫ్రంట్ కెమెరా: 5 మెగా పిక్సల్స్
కాగా, మోటో జడ్ ధర రూ.39,999లు, మోటో జడ్ ప్లే రూ.24,999లుగా కంపెనీ తెలిపింది.