అదిరే ఫీచర్లతో మోటోరోలా కొత్త ఫోన్
అదిరే ఫీచర్లతో మోటోరోలా కొత్త ఫోన్
Published Mon, Sep 19 2016 6:44 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ తయారీదారుల్లో ప్రముఖ కంపెనీగా ఉన్న మోటోరోలా, భారత మార్కెట్లోకి ఓ కొత్త స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. మోటో ఈ3 పవర్ పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్ ధర రూ.7,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ ప్రత్యేకంగా ఫ్లిప్కార్ట్ ద్వారానే అందుబాటులో ఉండనుంది. అన్ని మోటోరోలా స్మార్ట్ఫోన్ల కంటే అతిపెద్ద బ్యాటరీతో ఈ ఫోన్ను కంపెనీ రూపొందించింది. దీని బ్యాటరీ సామర్థ్యం 3,500 ఎంఏహెచ్. సోమవారం అర్థరాత్రి నుంచి ఈ ఫోన్ అమ్మకాలను మోటోరోలా చేపట్టనుంది. ప్రవేశ ఆఫర్ కింద ఈ ఫోన్ ధరపై రూ.1,000 తగ్గింపును కంపెనీ ఒక్క రోజు చేపడుతోంది.
మోటో ఈ3 పవర్ స్మార్ట్ఫోన్ ఫీచర్లు..
5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే
720x1280 పిక్సెల్ రెజుల్యూషన్
1గిగి హెడ్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6735పీ ప్రాసెసర్
2 జీబీ ర్యామ్
16 జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్
128 జీబీ వరకు విస్తరణ మెమరీ
8 ఎంపీ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో ఆపరేటింగ్ సిస్టమ్
డ్యుయల్ సిమ్ సపోర్టు
Advertisement
Advertisement