ప్లాన్ వర్కవుటైంది, ప్రత్యర్ధులు కూడా అదేబాటలో...
Published Sun, Aug 24 2014 11:32 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM
న్యూఢిల్లీ: వినూత్న పద్తతుల్లో అమ్మకాలు చేపట్టాలని తాము చేపట్టిన ప్రణాళిక వర్కవుటైందని మోటరోలా కంపెనీ వెల్లడించింది. రెగ్యులర్ గా మొబైల్ షాపుల్లో అమ్మకాలు చేపట్టడానికి బదులు ఆన్ లైన్ లో ఈ కామర్స్ ద్వారా మొబైల్ ఫోన్లను అమ్మాలని తాము తీసుకున్న నిర్ణయానికి భారీ స్పందన లభిస్తోందని మోటరోలా కంపెనీ తెలిపింది.
తాము అనుసరించిన పద్దతినే తమ పోటీదారులైన ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లాంటి సంస్థలు ఎంచుకుంటున్నాయని ఆ కంపెనీ ప్రతినిధులు అన్నారు. మోటో జి అనే మొబైల్ ఫోన్ ను తొలిసారి కేవలం ఆన్ లైన్ లోనే అమ్మకాలను ప్రారంభించింది.
ఆ తర్వాత మోటో ఈ, మోటో ఎక్స్ లాంటి మొబైల్స్ ను ఆన్ లైన్ ద్వారా విక్రయిస్తోంది. ఆతర్వాత షియోమీ మొబైల్ ను ఫిప్ కార్ట్, అసుస్, అల్కాటెల్ మొబైల్స్ ను స్నాప్ డీల్ ఈ పద్దతినే విక్రయిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.
Advertisement
Advertisement