మోటరోలా నుంచి 3జీ మోటో-ఈ స్మార్ట్‌ఫోన్ | 3G moto-e smart phone | Sakshi
Sakshi News home page

మోటరోలా నుంచి 3జీ మోటో-ఈ స్మార్ట్‌ఫోన్

Published Wed, Mar 11 2015 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM

మోటరోలా నుంచి 3జీ మోటో-ఈ స్మార్ట్‌ఫోన్

మోటరోలా నుంచి 3జీ మోటో-ఈ స్మార్ట్‌ఫోన్

ధర రూ.6,999
 
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటరోలా, 3జీ వెర్షన్ ‘మోటో-ఈ’ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ఈ ఫోన్‌లో 4.5 అంగుళాల స్క్రీన్,  2390 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 మెగాపిక్సెల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరా, 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ సామర్థ్యం ఉన్న క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలున్నాయి. దీని ధర రూ.6,999. ఈ స్మార్ట్‌ఫోన్లు ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే లభిస్తాయి. ఎప్పటి నుంచో ఫీచర్ ఫోన్లను ఉపయోగిస్తూ ఇప్పుడిప్పుడే స్మార్ట్‌ఫోన్ల వైపు మళ్లుతున్న వినియోగదారుల కోసమే ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తెచ్చామని మోటరోలా జనరల్ మేనేజర్ (ఇండియా) అమిత్ బోని ఈ సందర్భంగా చెప్పారు.
 
మే నాటికి 4జీ మోటో-ఈ స్మార్ట్‌ఫోన్
 లెనోవో (ఏ6000), జియోమి (రెడ్‌మి), మైక్రోమాక్స్ (యురేకా) వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వడానికి మోటరోలా సిద్ధమైంది. ఈ కంపెనీ వచ్చే మే నెల నాటికి రూ. 10,000 లోపు ధరలలో 4జీ వెర్షన్ మోటో-ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement