మోటో కొత్త ఫోన్..టీజర్ వచ్చేసింది
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మంచి జోరుమీదున్న మోటోరోలా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతుంది. మోటో జెడ్2 ప్లే పేరుతో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ జూన్ 8న భారత్ లో లాంచ్ చేయనున్నట్టు కంపెనీ టీజర్ విడుదల చేసింది. ప్రీ-ఆర్డర్లు కూడా ఆ రోజు నుంచే ప్రారంభించనున్నట్టు మోటో ఇండియా ఆదివారం ఓ ట్వీట్ చేసింది. గతేడాది మార్కెట్లోకి వచ్చిన మోటో జెడ్ ప్లేకు సక్సెసర్ గా దీన్ని ప్రవేశపెడుతున్నారు. మెరుగుపరిచిన కెమెరా, ప్రాసెసర్, స్పెషిఫికేషన్లు ఈ ఫోన్లో ఉండబోతున్నాయి. '' భారీ ఫోన్ కు ఇక గుడ్ బై చెప్పండి. నున్నగా ఉండే రీ-డిఫైన్డ్ మోటో జెడ్2 ప్లేకు హలో చెప్పండి!'' అంటూ కంపెనీ ఆదివారం ఓ ట్వీట్ చేసింది. అమెరికాలో ఈ ఫోన్ 499 డాలర్లు కాగ, భారత్ లో దీని ధర 25వేల రూపాయల నుంచి 30వేల రూపాయల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ అధికారిక వెబ్ సైట్ నుంచి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఈ ఫోన్ ను ఎక్కడ అందుబాటులో ఉంచుతుందో తెలుపలేదు.
ఇక ఈ ఫోన్ స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వస్తే...
5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే
కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 3
32జీబీ/64జీబీ స్టోరేజ్ ఆప్షన్లు
2టీబీ వరకు విస్తరణ మెమరీ
12ఎంపీ ప్రైమరీ కెమెరా
3జీబీ లేదా 4జీబీ ర్యామ్
5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్
ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 626 ప్రాసెసర్
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
గతవారమే మోటోరోలా మోటో సీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. మోటో ఈ4, మోటో ఈ4 ప్లస్ స్మార్ట్ ఫోన్లను కంపెనీ ఆవిష్కరించనుందని టెక్ వర్గాలు అంచనావేస్తున్నాయి.