Moto Z2 Play
-
ఫ్లిప్‌కార్ట్‌లో మోటో డేస్
ఫ్లిప్‌కార్ట్‌లో మోటో డేస్ సేల్కు తెరలేసింది. ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంలో మోటోరోలా మూడు రోజుల పాటు ఈ ప్రమోషనల్ సేల్‌ను నిర్వహిస్తోంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్ ఫిబ్రవరి 24 వరకు జరుగనుంది. మోటో డేస్ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన మోటోరోలా ఫోన్లు మోటో ఈ4 ప్లస్, మోటో ఎక్స్4, మోటో జెడ్2 ప్లే స్మార్ట్ఫోన్లు డిస్కౌంట్లో లభించనున్నాయి. మోటో డేస్ ఫ్లిప్‌కార్ట్ సేల్... మోటో ఈ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ రూ.9,499కి లిస్టు చేసింది. గతేడాది మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ అసలు ధర రూ.9,999. అదనంగా ఈ ఫోన్ ఎక్స్చేంజ్పై రూ.2000 తగ్గింపును ఇస్తోంది. దీంతో మొత్తంగా మోటో ఈ4 ప్లస్ ధర రూ.7,499కు దిగొచ్చింది. అయితే ఈ ఎక్స్చేంజ్ కూడా ఎంపిక చేసిన ఫోన్లపైనే ఇస్తారు. ఫైన్ గోల్డ్, ఐరన్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ఈ ఆఫర్ కింద లిస్టు అయి ఉంది. కొత్తగా లాంచ్ అయిన మోటో ఎక్స్4 ధరను కూడా ఫ్లిప్‌కార్ట్ రూ.20,999 నుంచి రూ.18,999కు తగ్గించింది. అదనంగా ఎక్స్చేంజ్పై మరో రెండు వేల రూపాయల తగ్గింపును ఇస్తోంది. మోటో జెడ్2 ప్లేను కంపెనీ గతేడాది లాంచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అత్యంత పాపులర్ ఫోన్‌గా పేరొందింది. ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ.27,999 కాగ, ప్రస్తుతం దీన్ని ఫ్లిప్‌కార్ట్ రూ.22,999కే అందుబాటులోకి తెచ్చింది. అదనంగా ఈ ఫోన్‌పై కూడా రెండు వేల రూపాయల తగ్గింపును ఇస్తోంది. -
మోటో కొత్త ఫోన్ వచ్చేసింది, లాంచ్ ఆఫర్లివే!
లెనోవో సొంతమైన మోటోరోలా తన సరికొత్త స్మార్ట్ ఫోన్ మోటో జెడ్2 ప్లేను భారత మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. రూ.27,999కు ఈ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నట్టు లెనోవా పేర్కొంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ ఫోన్ జూన్ 15 నుంచి అమ్మకానికి రానుంది. ప్రీబుకింగ్ లు నేటి నుంచి జూన్ 14వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి. మోటో జెడ్2 ప్లేతో పాటు లాంచింగ్ ఆఫర్లను కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. 2000 రూపాయలతో ఈ ఫోన్ ను ముందస్తు బుక్ చేసుకున్న వారు, జీరో శాతం వడ్డీతో 10నెలకు పైగా పేమెంట్ ను ఎంపికచేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు కూడా ఏమీ ఉండదు. జియో యూజర్లకు అదనంగా 100జీబీ 4జీ డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం రెగ్యులర్ కొనుగోలుదారులకు మాత్రమేనని, ప్రీ-బుక్ చేసుకునే వారికి కాదని లెనోవో పేర్కొంది. అంతేకాక ఎంపికచేసిన మోటో మోడ్స్ పై 50 శాతం తగ్గింపును ఇవ్వనుంది. మోటో జెడ్2 ప్లే స్పెషిఫికేషన్స్... ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ 5.5 అంగుళాల ఫుల్ హెచ్-డీ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ 2.2గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 626 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 12 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా వైడ్ యాంగిల్ లెన్స్ డ్యూయల్ ఎల్ఈడీ సీసీటీ ఫ్లాష్ ఫింగర్ ప్రింట్ స్కానర్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
మోటో కొత్త ఫోన్..టీజర్ వచ్చేసింది
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మంచి జోరుమీదున్న మోటోరోలా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతుంది. మోటో జెడ్2 ప్లే పేరుతో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ జూన్ 8న భారత్ లో లాంచ్ చేయనున్నట్టు కంపెనీ టీజర్ విడుదల చేసింది. ప్రీ-ఆర్డర్లు కూడా ఆ రోజు నుంచే ప్రారంభించనున్నట్టు మోటో ఇండియా ఆదివారం ఓ ట్వీట్ చేసింది. గతేడాది మార్కెట్లోకి వచ్చిన మోటో జెడ్ ప్లేకు సక్సెసర్ గా దీన్ని ప్రవేశపెడుతున్నారు. మెరుగుపరిచిన కెమెరా, ప్రాసెసర్, స్పెషిఫికేషన్లు ఈ ఫోన్లో ఉండబోతున్నాయి. '' భారీ ఫోన్ కు ఇక గుడ్ బై చెప్పండి. నున్నగా ఉండే రీ-డిఫైన్డ్ మోటో జెడ్2 ప్లేకు హలో చెప్పండి!'' అంటూ కంపెనీ ఆదివారం ఓ ట్వీట్ చేసింది. అమెరికాలో ఈ ఫోన్ 499 డాలర్లు కాగ, భారత్ లో దీని ధర 25వేల రూపాయల నుంచి 30వేల రూపాయల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ అధికారిక వెబ్ సైట్ నుంచి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఈ ఫోన్ ను ఎక్కడ అందుబాటులో ఉంచుతుందో తెలుపలేదు. ఇక ఈ ఫోన్ స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వస్తే... 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 3 32జీబీ/64జీబీ స్టోరేజ్ ఆప్షన్లు 2టీబీ వరకు విస్తరణ మెమరీ 12ఎంపీ ప్రైమరీ కెమెరా 3జీబీ లేదా 4జీబీ ర్యామ్ 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 626 ప్రాసెసర్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ గతవారమే మోటోరోలా మోటో సీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. మోటో ఈ4, మోటో ఈ4 ప్లస్ స్మార్ట్ ఫోన్లను కంపెనీ ఆవిష్కరించనుందని టెక్ వర్గాలు అంచనావేస్తున్నాయి. Bid Goodbye to a bulky phone & Say Hello to re-defined sleekness on the #MotoZ2Play! For pre-booking offers, visit: https://t.co/Jzch7gqsKv pic.twitter.com/EfDwV2nLTu — Moto India (@Moto_IND) June 4, 2017