మోటో కొత్త ఫోన్ వచ్చేసింది, లాంచ్ ఆఫర్లివే!
మోటో కొత్త ఫోన్ వచ్చేసింది, లాంచ్ ఆఫర్లివే!
Published Thu, Jun 8 2017 2:18 PM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM
లెనోవో సొంతమైన మోటోరోలా తన సరికొత్త స్మార్ట్ ఫోన్ మోటో జెడ్2 ప్లేను భారత మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. రూ.27,999కు ఈ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నట్టు లెనోవా పేర్కొంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ ఫోన్ జూన్ 15 నుంచి అమ్మకానికి రానుంది. ప్రీబుకింగ్ లు నేటి నుంచి జూన్ 14వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి. మోటో జెడ్2 ప్లేతో పాటు లాంచింగ్ ఆఫర్లను కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
2000 రూపాయలతో ఈ ఫోన్ ను ముందస్తు బుక్ చేసుకున్న వారు, జీరో శాతం వడ్డీతో 10నెలకు పైగా పేమెంట్ ను ఎంపికచేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు కూడా ఏమీ ఉండదు. జియో యూజర్లకు అదనంగా 100జీబీ 4జీ డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం రెగ్యులర్ కొనుగోలుదారులకు మాత్రమేనని, ప్రీ-బుక్ చేసుకునే వారికి కాదని లెనోవో పేర్కొంది. అంతేకాక ఎంపికచేసిన మోటో మోడ్స్ పై 50 శాతం తగ్గింపును ఇవ్వనుంది.
మోటో జెడ్2 ప్లే స్పెషిఫికేషన్స్...
ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్
5.5 అంగుళాల ఫుల్ హెచ్-డీ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే
కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
2.2గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 626 ప్రాసెసర్
4జీబీ ర్యామ్
64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
12 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
వైడ్ యాంగిల్ లెన్స్
డ్యూయల్ ఎల్ఈడీ సీసీటీ ఫ్లాష్
ఫింగర్ ప్రింట్ స్కానర్
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
Advertisement
Advertisement