మోటో స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌, స్పెషల్‌ ఆఫర్స్‌ | MotoE4Plus for Rs. 9,999, on @Flipkart. Sale starts tonight at 11:59 PM. Get exciting launch offers | Sakshi
Sakshi News home page

మోటో స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌, స్పెషల్‌ ఆఫర్స్‌

Published Wed, Jul 12 2017 12:50 PM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

మోటో  స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌,  స్పెషల్‌ ఆఫర్స్‌

మోటో స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌, స్పెషల్‌ ఆఫర్స్‌

మోటోరోలా  త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్  మోటో ఈ4 ప్లస్‌ ను విడుద‌ల   చేసింది.  ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోటోఈ సిరీస్‌  స్మార్ట్‌ఫోన్లను బుధవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది.     మెటల్ బాడీ యూనిక్‌  డిజైన్‌తో   బడ్జెట్‌ ధరల్లో మోటో ఈ4, ఈ4 ప్ల‌స్‌ల‌ను విడుద‌ల చేసింది. అతి పెద్ద  బ్యాటరీ  సామర్థ్యంతో ఈ4 ప్లస్‌ ను  వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.    ఈ  ఈ4 ప్లస్‌ ధర రూ.9,999లకు,  మోటో ఆ4 రూ. 8999 ధరకే   అందించనుంది.  ఫ్లిప్‌కార్ట్‌లో  బుధవారం అర్థరాత్రినుంచి  విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

మోటో ఈ4 ప్ల‌స్‌ ఫీచర్లు
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే,
1280 x 720 పిక్సెల్‌ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్ఆపరేటింగ్‌ సిస్టమ్‌,
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌,
 2/3 జీబీ ర్యామ్16 జీబీ ఇంట‌ర్నల్‌ స్టోరేజ్
32జీబీ దాకా  స్టోరేజ్‌ను విస్తరించుకునే సదుపాయం
13 ఎంపీ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.
 ప్రీమియం మెటల్‌ బాడీతో డిజైన్‌ చేసిన ఈ  4 ప్లస్‌ ఐరన్‌గ్రే, ఫైన్‌ గోల్డ్‌ కలర్స్‌లో లభ్యం కానుంది.  మోటా ఈ 4  విషయానికి  వస్తే 5 అంగుళాల డిస్‌ప్లే, 2 జీబీ ర్యామ్‌, 16జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌,  8 ఎంపీ రియర్‌ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ   కెమెరాఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌,  2800 బ్యాటరీ  సామర్ధ్యం  ఫీచర్లతో బ్లూయిష్‌ గోల్డ్‌ కలర్‌లో లాంచ్‌ చేసింది.  గత  మూడేళ్లుగా  ఎన్నో  మైలురాళ్లను అధిగమించినట్టు   మోటో ఎండీ మాధుర్‌  సూదిన్‌ ప్రకటించారు.  ఆకర్షణీయ ధరల్లో అద్భుత ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా తన ప్రస్థానం కొనసాగుతుందన్నారు.

 లాంచింగ్‌ ప్రత్యేక ఆఫర్లు
  మోటో హెడ్‌ఫోన్స్‌ పై రూ .649డిస్కౌంట్‌  
2 నెలల  ప్రీమియం హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప‍్షన్‌ ఉచితం
ఐడియా సెల్యులార్ వినియోగదారులకు రూ. 443 రీఛార్జిపై 3 నెలల పాటు 84జజీబీ డేటాను పొందవచ్చు. దీనితో పాటు  మోటోఈ4  కొనుగోలుపై రూ. 9,000వరకు ఎక్సేంజ్‌ ఆఫర్ పొందవచ్చు.

ఈ4  ప్లస్ కొనుగోలుదారులు  రూ.4వేల   బై బ్యాక్‌ గ్యారంటీ ఆఫర్‌
రిలయన్స్‌జియో   ప్రైమ్‌ కస్టమర్లు 4జీబీ  30జీబీ అదనపు డేటా


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement