Moto E4 Plus
-
ఈ ఫోన్ తొలిరోజే దుమ్మురేపింది
అదిరిపోయే ఫీచర్లతో మోటో ఈ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్ జూలై 12న మార్కెట్లోకి లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చిన తొలిరోజే దుమ్మురేపింది. ఎక్స్‌క్లూజివ్ పార్టనర్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చిన 24 గంటల్లోనే లక్షకు పైగా యూనిట్ల అమ్మకాలను నమోదుచేసింది. తొలి 60 నిమిషాల్లో నిమిషానికి 580 యూనిట్లకు పైగా మోటో ఈ4 ప్లస్ అమ్ముడుపోయినట్టు ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రకటించారు. ఉత్తర భారత దేశ నగరాల నుంచి ఈ ఫోన్‌కు భారీ ఎత్తున్న డిమాండ్ వచ్చినట్టు కూడా ఫ్లిప్‌కార్ట్ చెప్పింది. మొత్తం అమ్మకాల్లో యూపీ, బిహార్ రాష్ట్రాల నుంచి 12 శాతం నమోదైనట్టు తెలిపింది. అంతేకాక మోటో ఈ4 ప్లస్ లైవ్‌గా లాంచ్ అయ్యేటప్పుడు కేవలం గంటల్లోనే ఈ ప్రొడక్ట్ పేజీని 1.5 లక్షల మంది కస్టమర్లు విజిట్ చేసినట్టు తెలిసింది. 9,999 రూపాయలకు మోటో ఈ4 ప్లస్ మార్కెట్లోకి లాంచ్ అయింది. ఈ ఫోన్ లాంచింగ్‌తో పాటు పలు ఆఫర్లను కూడా కంపెనీ తీసుకొచ్చింది. లాంచింగ్ ప్రత్యేక ఆఫర్లు మోటో హెడ్‌ఫోన్స్ పై రూ .649డిస్కౌంట్ హాట్‌స్టార్ యాప్ ప్రీమియం సేవలు 2 నెలల పాటు ఉచితం ఐడియా సెల్యులార్ వినియోగదారులకు రూ. 443 రీఛార్జిపై 3 నెలల పాటు 84జజీబీ డేటాను పొందవచ్చు. దీనితో పాటు ఈ ఫోన్‌ను పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్చేంజ్లో కొనుగోలుచేస్తే రూ. 9,000వరకు ధర తగ్గుతుంది. రూ.4వేల బై బ్యాక్ గ్యారంటీ ఆఫర్ రిలయన్స్జియో ప్రైమ్ కస్టమర్లు 4జీబీ 30జీబీ అదనపు డేటా మోటో ఈ4 ప్లస్ ఫీచర్లు 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 720 x 1280 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 32జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 128జీబీ వరకు విస్తరణ మెమరీ 13 ఎంపీ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
మోటో స్మార్ట్ఫోన్లు లాంచ్, స్పెషల్ ఆఫర్స్
మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటో ఈ4 ప్లస్ ను విడుదల చేసింది. ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోటోఈ సిరీస్ స్మార్ట్ఫోన్లను బుధవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. మెటల్ బాడీ యూనిక్ డిజైన్‌తో బడ్జెట్ ధరల్లో మోటో ఈ4, ఈ4 ప్లస్‌లను విడుదల చేసింది. అతి పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో ఈ4 ప్లస్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఈ4 ప్లస్ ధర రూ.9,999లకు, మోటో ఆ4 రూ. 8999 ధరకే అందించనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో బుధవారం అర్థరాత్రినుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. మోటో ఈ4 ప్లస్ ఫీచర్లు 5.5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 1280 x 720 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.1 నూగట్ఆపరేటింగ్ సిస్టమ్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 32జీబీ దాకా స్టోరేజ్‌ను విస్తరించుకునే సదుపాయం 13 ఎంపీ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ. ప్రీమియం మెటల్ బాడీతో డిజైన్ చేసిన ఈ 4 ప్లస్ ఐరన్గ్రే, ఫైన్ గోల్డ్ కలర్స్‌లో లభ్యం కానుంది. మోటా ఈ 4 విషయానికి వస్తే 5 అంగుళాల డిస్ప్లే, 2 జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాఫింగర్ ప్రింట్ సెన్సర్, 2800 బ్యాటరీ సామర్ధ్యం ఫీచర్లతో బ్లూయిష్ గోల్డ్ కలర్లో లాంచ్ చేసింది. గత మూడేళ్లుగా ఎన్నో మైలురాళ్లను అధిగమించినట్టు మోటో ఎండీ మాధుర్ సూదిన్ ప్రకటించారు. ఆకర్షణీయ ధరల్లో అద్భుత ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా తన ప్రస్థానం కొనసాగుతుందన్నారు. లాంచింగ్ ప్రత్యేక ఆఫర్లు మోటో హెడ్‌ఫోన్స్ పై రూ .649డిస్కౌంట్ 2 నెలల ప్రీమియం హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితం ఐడియా సెల్యులార్ వినియోగదారులకు రూ. 443 రీఛార్జిపై 3 నెలల పాటు 84జజీబీ డేటాను పొందవచ్చు. దీనితో పాటు మోటోఈ4 కొనుగోలుపై రూ. 9,000వరకు ఎక్సేంజ్ ఆఫర్ పొందవచ్చు. ఈ4 ప్లస్ కొనుగోలుదారులు రూ.4వేల బై బ్యాక్ గ్యారంటీ ఆఫర్ రిలయన్స్జియో ప్రైమ్ కస్టమర్లు 4జీబీ 30జీబీ అదనపు డేటా -
భారీ బ్యాటరీతో మోటో కొత్త ఫోన్
లెనోవోకు చెందిన మోటోరోలా మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేయబోతుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో మోటో ఈ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లోకి ఈ నెల 12న లాంచ్ చేయబోతున్నట్టు కంపెనీ ధృవీకరించింది. వచ్చే వారంలో జరుగోయే లాంచింగ్ ఈవెంట్‌కు కంపెనీ ఆహ్వానాలు కూడా పంపుతోంది. గత నెలలోనే ఈ ఫోన్‌ను భారత్‌లోకి తీసుకొస్తున్నట్టు ధృవీకరిస్తూ ఓ వీడియోను కూడా పోస్టు చేసింది. ఈ మోడల్‌ను గ్లోబల్‌గా జూన్‌లోనే మోటో ఈ4 స్మార్ట్‌ఫోన్‌తో పాటు లాంచ్ చేసింది. మోటో ఈ4 ప్లస్ మోడల్ ప్రత్యేక ఆకర్షణ బిగ్ బ్యాటరీ. భారత మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న రెడ్మి 4 స్మార్ట్‌ఫోన్‌కు గట్టిపోటీగా ఈ ఫోన్ లాంచ్ కాబోతుంది. స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే, మోటో ఈ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 720 x 1280 పిక్సెల్ రెజుల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16జీబీ/32జీబీ స్టోరేజ్, 13 ఎంపీ రియర్ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్‌కెమెరా, ఆండ్రాయిడ్ నోగట్ 7.1.1 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి. మోటో ఈ4 కంటే దీనిధర ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది. సుమారు రూ.11,600 మధ్యలో మోటో ఈ4 ప్లస్ ధర ఉండవచ్చని టాక్. ఐరన్ గ్రే, ఫైన్ గోల్డ్ కలర్ రంగుల్లో ఇది లభ్యంకానుంది. దీని ఎక్స్‌క్లూజివ్‌గా కూడా ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌పైననే తీసుకురాబోతుంది. -
మోటో ఈ 4ప్లస్, అతిపెద్ద బ్యాటరీ
మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ 'మోటో ఈ4 ప్లస్ ను విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫోటోలో నెట్ లోచక్కర్లు కొడుతున్నాయి. మొదట యూరోప్ జోన్ లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. అతి పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో దీన్ని వినియోగదారులకు అందించనుంది.మొదట యూరోప్‌లోనే ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లోనూ లాంచ్ చేయనుందట. రిమూవబుల్ బ్యాక్ కవరతోరానున్న ఈ డివైస్ ధర సుమారు రూ.13,305గా నిర్ణయించవచ్చని అంచనా. ఇకపోతే మోటో ఈ ప్లస్ 4 ఫీచర్లు, ఇతర స్పెసిఫికేషన్లపై అంచనాలు ఇలా వున్నాయి. 5.5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 1280 x 720 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.1 నూగట్ఆపరేటింగ్ సిస్టమ్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 13 ఎంపీ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ