భారీ బ్యాటరీతో మోటో కొత్త ఫోన్‌ | Moto E4 Plus with 5000mAh battery set for launch in India this month | Sakshi
Sakshi News home page

భారీ బ్యాటరీతో మోటో కొత్త ఫోన్‌

Published Thu, Jul 6 2017 11:52 AM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM

Moto E4 Plus with 5000mAh battery set for launch in India this month



లెనోవోకు చెందిన మోటోరోలా మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేయబోతుంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో మోటో ఈ4 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లోకి ఈ నెల 12న లాంచ్‌ చేయబోతున్నట్టు కంపెనీ ధృవీకరించింది. వచ్చే వారంలో జరుగోయే లాంచింగ్‌ ఈవెంట్‌కు కంపెనీ ఆహ్వానాలు కూడా పంపుతోంది. గత నెలలోనే ఈ ఫోన్‌ను భారత్‌లోకి తీసుకొస్తున్నట్టు ధృవీకరిస్తూ ఓ వీడియోను కూడా పోస్టు చేసింది. ఈ మోడల్‌ను గ్లోబల్‌గా జూన్‌లోనే మోటో ఈ4 స్మార్ట్‌ఫోన్‌తో పాటు లాంచ్‌ చేసింది. మోటో ఈ4 ప్లస్‌ మోడల్‌ ప్రత్యేక ఆకర్షణ బిగ్‌ బ్యాటరీ. 
 
భారత మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న రెడ్‌మి 4 స్మార్ట్‌ఫోన్‌కు గట్టిపోటీగా ఈ ఫోన్‌ లాంచ్‌ కాబోతుంది. స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే, మోటో ఈ4 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌కు 5.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సెల్‌ రెజుల్యూషన్‌, స్నాప్‌డ్రాగన్‌ 425 ప్రాసెసర్‌, 2జీబీ ర్యామ్‌, 16జీబీ/32జీబీ స్టోరేజ్‌, 13 ఎంపీ రియర్‌ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్‌కెమెరా, ఆండ్రాయిడ్‌ నోగట్‌ 7.1.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉన్నాయి. మోటో ఈ4 కంటే దీనిధర ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది. సుమారు రూ.11,600 మధ్యలో మోటో ఈ4 ప్లస్‌ ధర ఉండవచ్చని టాక్‌. ఐరన్‌ గ్రే, ఫైన్‌ గోల్డ్‌ కలర్‌ రంగుల్లో ఇది లభ్యంకానుంది. దీని ఎక్స్‌క్లూజివ్‌గా కూడా ఫ్లిప్‌కార్ట్‌ ప్లాట్‌ఫామ్‌పైననే తీసుకురాబోతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement