మోటో డేస్: స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు | Motorola announces anniversary celebrations on Flipkart on February 20-21 | Sakshi
Sakshi News home page

మోటో డేస్: స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు

Published Sat, Feb 18 2017 2:05 PM | Last Updated on Tue, Jun 4 2019 6:39 PM

మోటో డేస్: స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - Sakshi

మోటో డేస్: స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు

మోటో ఉత్పత్తుల భారత్లోకి ప్రవేశపెట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా లెనోవో ఘనంగా మోటోరోలా కంపెనీ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 20, 21 తేదీల్లో రెండు రోజుల పాటు 'మోటో డేస్ ఆఫర్స్' పేరుతో ఈ వేడుకలను ప్రత్యేకంగా ఫ్లిప్కార్ట్ ప్లాట్ ఫామ్పై సెలబ్రేట్ చేస్తోంది. ఈ సందర్భంగా మోటో స్మార్ట్ ఫోన్లపై బపర్ ఆఫర్లు ప్రకటించింది. సెలబ్రేషన్స్ లో భాగంగా మోటో జెడ్, జెడ్ ప్లే స్మార్ట్ ఫోన్లపై రూ.20వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ను, కొనుగోలుపై రూ.2000 డిస్కౌంట్ ను ఆఫర్ చేసింది. మోటో జీ టర్బో ఎడిషన్, మోటో ఎం వంటి డివైజ్ లకు ఫ్లాట్పై రూ.1000 వరకు డిస్కౌంట్ ను ప్రకటించింది.
 
ఇండస్ ఇండ్ బ్యాంకు క్రెడిట్ కార్డు యూజర్లకైతే 10 శాతం డిస్కౌంట్ ను కూడా ఇది ఆఫర్ చేయనుంది.  మోటో జెడ్ ఫోన్ అసలు ధర రూ.39,999. మోటో జెడ్ ప్లే అసలు ధర రూ.24,999. ఈ సేల్ నేపథ్యంలో మోటోరోలా తయారుచేసిన నెక్సస్ 6ను డిస్కౌంట్ ధరకు విక్రయించనుంది. 32జీబీ వేరియంట్ రూ.19,999కు, 64జీబీ వేరియంట్ రూ.25,999కు అందుబాటులో ఉండనుంది. అదేవిధంగా మోటో జీ(రెండవ తరం) 16జీబీ వేరియంట్ రూ.6,999కు, మోటో జీ (3వ తరం) 8జీబీ వేరియంట్ ఫోన్ రూ.7,999కు కంపెనీ విక్రయించనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement