న్యూఢిల్లీ: భారతి ఎయిర్ టెల్ తన ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు జాతీయంగా గురువారం లాంచ్ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెల్లింపుల బ్యాంక్ ను అధికారికంగా ప్రారంభించారు. రూ .3,000 కోట్ల ప్రారంభ పెట్టుబడి తో పొదుపు ఖాతాలపై 7.25 శాతం వడ్డీ రేటుతో ఎయిర్టెల్ పే మెంట్ బ్యాంక్ దేశవ్యాప్తంగా కార్యకలాపాలను ప్రారంభించింది. దీని ద్వారా దాదాపు 29 నగరాల్లో తన బ్యాంకింగ్ సేవలను అందించనుంది.
తమ ఎయిర్ టెల్ చెల్లింపులు బ్యాంక్ తో, ప్రయాణం లో మరొక ముఖ్యమైన అధ్యాయం ప్రారంభించామని భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ చెప్పారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు లక్ష్యంతో 260 మిలియన్ల వినియోగదారుల బేస్ ఉన్న ఎయిర్ టెల్ లోని ఖాతాదారుల మొబైల్ నెంబరే పే మెంట్ బ్యాంక్ సేవింగ్ ఎకౌంట్ ఖాతాగా పరిగణిస్తామన్నారు. డిజిటల్ చెల్లింపుల ఎకో సిస్టంకు తమసంస్థ కట్టుబడి ఉందని తెలిపారు.
కాగా గత ఏడాది నవంబరు పైలట్ ప్రాజెక్టుగా రాజస్థాన్ లో లాంచ్ అయింది. అనంతరం డిసెంబర్ ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాల్లో సేవలను ప్రారంభించింది. అయితే రిజర్వ్ బ్యాంక్ లైసెన్సు లు మంజూరు చేసిన 11 పే మెంట్ బ్యాంకుల్లో 4-5 టెలికాం కంపెనీలవే కావడం విశేషం.
ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ కొత్త అధ్యాయం
Published Thu, Jan 12 2017 7:56 PM | Last Updated on Fri, Aug 17 2018 6:18 PM
Advertisement
Advertisement