Sony India
-
బ్రాండ్ అంబాసిడర్‌గా రాజమౌళి.. రూ.8,500 కోట్లు టార్గెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం సోనీ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.8,500 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకుంది. 2023–24లో కంపెనీ రూ.6,353 కోట్లు సాధించింది. ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్స్, వయో ల్యాప్టాప్స్ విభాగాలతో కలిపి 2014–15లో సోనీ ఇండియా రూ.11,000 కోట్ల ఆదాయం సముపార్జించింది.సంస్థకు అతి పెద్ద మార్కెట్ల పరంగా యూఎస్, చైనా, జపాన్ తర్వాత నాల్గవ స్థానంలో భారత్ నిలిచింది. స్మార్ట్ టీవీ, ఆడియో, డిజిటల్ ఇమేజింగ్ ఉత్పత్తులు ప్రస్తుత వృద్ధిని నడిపిస్తున్నాయని సోనీ ఇండియా ఎండీ సునీల్ నయ్యర్ తెలిపారు. వృద్ధి ఇలాగే కొనసాగితే భారత ర్యాంకు మరింత మెరుగుపడుతుందని చెప్పారు. సగటు విక్రయ ధరను పెంచే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు.ప్రీమియం ఉత్పత్తుల వైపు మార్కెట్ మళ్లుతున్న నేపథ్యంలో సోనీ ఇండియాకు ఈ అంశం కలిసి వస్తుందన్నారు. చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి చేతుల మీదుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత 2024 బ్రావియా 9, 8, 7, 3 సిరీస్‌ను సోమవారమిక్కడ విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.ఈ సిరీస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా రాజమౌళి వ్యవహరిస్తారని కంపెనీ ప్రకటించింది. స్మార్ట్ టీవీల విభాగంలో 20% విలువ వృద్ధి ఆశిస్తున్నట్టు తెలిపారు. 55 అంగుళాలు ఆపైన విభాగంలో ఆధిపత్యం కొనసాగిస్తున్నామని అన్నారు. 75 అంగుళాలు ఆపైన సెగ్మెంట్లో 50% పైన వృద్ధి సాధిస్తున్నామని వివరించారు. టీవీల వ్యాపారంలో మార్కెటింగ్‌పైన రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు పేర్కొన్నారు. రూ.15,000లకుపైగా ఖరీదు చేసే సౌండ్‌బార్స్ విభాగంలో 53% వాటాతో అగ్రస్థానంలో ఉన్నట్టు తెలిపారు. -
సోనీ బ్రావియా కొత్త టీవీలు
విజయవాడ: సోనీ ఇండియా కంపెనీ ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి సోనీ బ్రావియా ఎక్స్70ఎల్, బ్రావియా ఎక్స్75ఎల్ సిరీస్ టీవీలను విడుదల చేసింది. ఎక్స్1 4కే ప్రోసెసర్, లైవ్ కలర్, డాల్బీ ఆడియా, క్లియర్ ఫేస్ టెక్నాలజీ, 10వేలకి పైగా యాప్స్, గేమ్స్‌తో పాటు ఏడు లక్షలకు పైగా సినిమాలు, టీవీ సిరీస్‌లను కలిగిన గూగుల్ టీవీ ఫీచర్లు వీటిలో ఉన్నాయి. ఎక్స్–ప్రొటెక్షన్ పీఆర్ఓ, వాయిస్ ఆధారిత రిమోట్–స్మార్ట్ రిమోట్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఎక్స్ 75ఎల్ సిరీస్‌లో మొత్తం నాలుగు మోడళ్లు ఉన్నాయి. వీటి ధరలు రూ.1.04 లక్షలు – రూ. 51,999 మధ్య ఉన్నాయి. ఇక ఎక్స్70ఎల్ సిరీస్‌లో రెండు మోడళ్లు ఉన్నాయి. ఇందులో కేడి–43 ఎక్స్70ఎల్ ధర రూ.49,990, కేడి–50 ఎక్స్70ఎల్ ధర రూ.61,990 గా ఉంది. పై రెండు సిరీస్‌లోని మోడళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని సోనీ సెంటర్లు, ప్రముఖ ఎలక్ట్రానిక్స్ షాపుల్లో, ఈ–కామర్స్ పోర్టళ్లలో లభిస్తాయిని కంపెనీ తెలిపింది. -
పీటీఐతో సోనీ ఇండియా జట్టు
న్యూఢిల్లీ: దేశీయంగా అతి పెద్ద స్వతంత్ర న్యూస్ ఏజెన్సీ అయిన పీటీఐకి ప్రత్యేకంగా డిజిటల్ ఇమేజింగ్ సొల్యూషన్స్ అందించేలా సోనీ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా ప్రెస్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఫొటోగ్రాఫర్లు, వీడియో జర్నలిస్టులకు సోనీ ఇండియా ఎక్స్‌క్లూజివ్ డిజిటల్ ఇమేజింగ్ సొల్యూషన్స్ సరఫరాదారుగా ఉంటుంది. ఆయా ఉత్పత్తులను వాడటంలో వారికి శిక్షణ కూడా ఇస్తుంది. పీటీఐ వంటి విశ్వసనీయ న్యూస్ ఏజెన్సీతో జట్టు కట్టడం తమకు ఎంతో ప్రతిష్టాత్మకమైన విషయమని సోనీ ఇండియా ఎండీ సునీల్ నయ్యర్ తెలిపారు. మరోవైపు వీడియో జర్నలిజంలోకి అడుగుపెడుతున్న తమకు.. కొంగొత్త టెక్నాలజీలను ఆవిష్కరించడంలో ముందుండే సోనీతో భాగస్వామ్యం ఎంతగానో ప్రయోజనకరమని పీటీఐ సీఈవో విజయ్ జోషి చెప్పారు. పీటీఐ ప్రతి రోజూ 2,000 పైచిలుకు స్టోరీలు, 200 పైగా ఫొటోగ్రాఫ్‌లను సుమారు 500పైగా భారతీయ వార్తాపత్రికలకు అందిస్తోంది. చదవండి: అన్ని మోడళ్ల కార్లను మార్చేస్తున్న వోల్వో.. కారణం ఇదే! -
సోనీటీవీలో జీ ఎంటర్టైన్మెంట్ విలీనం !
-
సోనీకి వినియోగదారుల ఫోరం మొట్టికాయ
ఢిల్లీ : సోనీ ఇండియాకు ఢిల్లీలోని జిల్లా వినియోగదారుల ఫోరం మొట్టికాయ వేసింది. సోనీ ఇచ్చిన ప్రకటనల్లో వాటర్ ప్రూఫ్‌గా పేర్కొంటూ విడుదల చేసిన ఓ ఖరీదైన ఫోన్‌ను వినియోగదారుడు కొనుగోలు చేశాడు. తీరా ఆ ఫోన్ వర్షపు నీటిలో తడిచి పాడవ్వడంతో స్థానిక సర్వీసింగ్ సెంటర్‌కి వెళితే డబ్బు చెల్లిస్తేనే రిపేర్ చేస్తామంటూ తెలపడంతో సదరు వ్యక్తి వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. విచారణ అనంతరం సోనీ ఇండియా, సర్వీసింగ్ సెంటర్ వినియోగదారుడికి సేవలు అందిచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వినియోగదారుల ఫోరం పేర్కొంది. వివరాలు.. పశ్చిమ ఢిల్లీకి చెందిన ధన్‌రాజ్ సోనీ ఇచ్చిన వాటర్ ప్రూఫ్ మొబైల్ ప్రకటనను చూసి రూ.35,000తో ఫోన్‌ను కొనుగోలు చేశాడు. అయితే వర్షం నీటిలో తడవడంతో ఫోన్ పని చేయడం ఆగిపోయింది. దీంతో దగ్గర్లోని షోరూంకు వెళ్లి సర్వీస్ చేయవలసిందిగా కోరగా, సోనీ నియమ నిబంధనల ప్రకారం ఫ్రీ సర్వీస్ వారంటీలోకి సంబంధిత రిపేర్ రాదని, రిపేర్ చేయాంటే డబ్బు చెల్లించాలని స్పష్టం చేశారు. కంగుతిన్న ధన్‌రాజ్ వినియోగ దారుల ఫోరంను ఆశ్రయించాడు. తప్పుడు ప్రకటనలతో సోనీ కంపెనీ తనను మోసం చేసిందని ధన్ రాజ్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ధన్ రాజ్ సోనీ ఇచ్చిన వాటర్ ప్రూఫ్ ప్రకటనను కూడా ఫిర్యాదులో జత చేశాడు. ఆ వీడియో ప్రకటనలో ఫోన్‌కు సంబంధించి అన్ని భాగాలు సవ్యంగా మూసి ఉంటే 1.5 మీటర్ల లొతున్న నీటిలో పడి దాదాపు 30 నిమిషాలపాటూ ఉన్నా కూడా మొబైల్ ఫోన్‌కు ఏమీకాదు అని ఉంది. అయితే వినియోగదారుడు నిర్లక్ష్యంగా మొబైల్‌ను వాడటం వల్లే పాడైందని సోనీ, సర్వీస్ సెంటర్ వివరణ ఇచ్చాయి. కస్టమర్‌కు తగిన సేవలను అందిచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వినియోగ దారుల ఫోరం తెలిపింది. పూర్తి మొబైల్ ధర(రూ.35000)తో పాటూ, నష్టపరిహారం కింద మరో వేయ్యి రూపాయలు అదనంగా ఇవ్వాలని సోనీ కంపెనీ, సర్సీస్ సెంటర్‌ను ఆదేశించింది. -
పెద్ద టీవీలకు డిమాండ్ బాగుంది
• సోనీ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ కెన్చిరో హిబి • హై ఎండ్ స్మార్ట్ ఫోన్లపై దృష్టి • ఈ ఏడాది వ్యాపారంలో 25 శాతం వృద్ధి అంచనా సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగడంతో ఈ ఏడాది గృహోపకరణాల అమ్మకాల్లో వృద్ధి కనిపిస్తోందని సోనీ ఇండియా పేర్కొంది. అలాగే ఇండియాలో పెద్ద అంగుళాల టీవీలకు డిమాండ్ క్రమేపీ పెరుగుతోందని చెపుతోంది. కొత్త మోడల్స్‌ను విడుదల చేయడం కంటే కొత్త టెక్నాలజీపైనే అధికంగా దృష్టి సారిస్తున్నామంటున్న సోనీ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ కెన్చిరో హిబితో ‘సాక్షి’ ఇంటర్వ్యూ వివరాలు.... ఈ ఏడాది అమ్మకాలు ఎలా ఉన్నాయి? గడిచిన రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు బాగున్నాయి. ప్రస్తుత ఆర్థిక ఏడాది మొదటి ఆరు నెలల్లో 20 శాతం వృద్ధి నమోదయ్యింది. వడ్డీరేట్లు తగ్గడం, ఏడవ వేతన సవరణ వంటి అంశాలు అమ్మకాలు పెరగడానికి దోహదం చేశాయని చెప్పవచ్చు. వచ్చే రెండు నెలల పండుగల సీజన్ దృష్టిలో పెట్టుకుంటే ఏడాది మొత్తం మీద 25 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నాం. కంపెనీ నిబంధనలు అనుసరించి దేశాల వారీగా అమ్మకాల విలువను చెప్పలేము. కానీ ఇండియా అమ్మకాల్లో విజయవాడ 5 శాతంతో అత్యధిక వృద్ధిని నమోదు చేస్తూ ఇండియాలోనే మొదటి స్థానంలో ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ మార్కెట్‌ను పరిశీలిస్తున్నా. ఇందులో భాగంగా విజయవాడ, రాజమండ్రి, కాకినాడ మార్కెట్ ట్రెండ్‌ను స్వయంగా పరిశీలిస్తున్నా. వినియోగదారులు ఏ తరహా ఉత్పత్తులపై ఆసక్తి చూపుతున్నారు? టెక్నాలజీ నచ్చితే ఎంత ధరకైనా కొనడానికి వెనుకాడటం లేదు. ఇప్పుడు ఇండియాలో పెద్ద పెద్ద టీవీలకు మంచి డిమాండ్ ఉంది. అలాగే సరౌండింగ్ ఆడియో సిస్టమ్స్‌కి డిమాండ్ కనిపిస్తోంది. అందుకే కొత్త మోడల్స్‌ను విడుదల చేయడం కంటే కొత్త టెక్నాలజీని పరిచయం చేయడంపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నాం. అలాగే స్మార్ట్ ఫోన్లలో కేవలం హైఎండ్ రేంజ్ మీదనే దృష్టిసారిస్తున్నాం. ఫోన్లలో హైఎండ్ కెమెరా టెక్నాలజీ రావడంతో చిన్న స్థాయి డిజిటల్ కెమెరాల అమ్మకాలు తగ్గుతున్నాయి. కానీ ఇదే సమయంలో డీఎస్ఎల్ఆర్ వంటి ప్రొఫెషనల్ కెమెరాల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది సోనీ నుంచి కొత్త ప్రొడక్టులను ఆశించవచ్చా? బ్రావియా బ్రాండ్ నుంచి ఇంకా పెద్ద టీవీని విడుదల చేయనున్నాం. అలాగే ఆడియో సిస్టమ్‌లో కొత్త సరౌండింగ్ టెక్నాలజీ ప్రొడక్టు రానుంది. ఈ మధ్యనే విడుదల చేసిన సోనీ ఎక్స్‌పీరీయా ఎక్స్జెడ్కు మంచి స్పందన వస్తోంది. సోనీ విస్తరణ ప్రణాళికలను వివరిస్తారా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 బ్రాండెడ్ షోరూంలున్నాయి. ఇవి కాకుండా 350 సేల్స్ కమ్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. ప్రస్తుతం మేము ఇంకా పూర్తిస్థాయిలో ఇండియా మొత్తం విస్తరించలేదు. డిమాండ్‌ను బట్టి అవకాశాలను పరిశీలిస్తూ విస్తరణ ప్రణాళికలను చేపడతాం. ఈ ఏడాది మార్కెటింగ్ కోసం రూ.420 కోట్లు ఖర్చు చేయనున్నాం. గతేడాది రూ. 550 కోట్లు వరకు ఖర్చు చేశాం. ఏపీలో యూనిట్ పెట్టే ఆలోచన ఉందా? చెన్నైలో టీవీ అసెంబ్లింగ్ యూనిట్, నోయిడాలో పెన్‌డ్రైవ్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కేంద్రాలున్నాయి. ప్రస్తుతం వీటిని మరింతగా విస్తరించే ఆలోచన ఏమీ లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయిడు జపాన్ పర్యటన సందర్భంగా సోనీ యూనిట్‌ను సందర్శించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని కోరారు. కానీ దీని మీద ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అవకాశాలు, డిమాండ్‌ను బట్టి తయారీ కేంద్రం ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తాం. -
భారత్‌లో సోనీ సొంత ప్లాంటు
• మొబైళ్ల తయారీ కూడా చేపట్టే చాన్స్ • ఈ ఏడాది 20 శాతం వృద్ధి అంచనా • సోనీ ఇండియా ఎండీ కెనిచిరో హిబి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం సోనీ సొంత తయారీ కేంద్రాన్ని భారత్‌లో నెలకొల్పాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ తమిళనాడులో థర్డ్ పార్టీకి చెందిన ప్లాంటులో ఉపకరణాలను అసెంబుల్ చేస్తోంది. సొంత ప్లాంటు ఏర్పాటుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాలను పరిశీలిస్తున్నట్టు సోనీ ఇండియా ఎండీ కెనిచిరో హిబి తెలిపారు. దక్షిణప్రాంత సేల్స్ మేనేజర్ జి.రాజేశ్, హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ అభిజిత్‌తో కలసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 22-55 అంగుళాల ప్యానెళ్లను ఇప్పటికే భారత్‌లో అసెంబుల్ చేస్తున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో మరింత పెద్ద సైజు ప్యానెళ్ల అసెంబ్లింగ్ చేపడతామన్నారు. స్మార్ట్ఫోన్లను దేశీయంగా తయారీ చేసే అవకాశాన్ని అధ్యయనం చేస్తున్నట్టు పేర్కొన్నారు. మీడియాతో ఆయనింకా ఏమన్నారంటే.. పండుగల సీజన్లో.. గతేడాదితో పోలిస్తే రానున్న పండుగల సీజన్లో అమ్మకాల్లో 40 శాతం వృద్ధిని ఆశిస్తున్నాం. మార్కెటింగ్‌కుగాను రూ.150 కోట్లు కేటాయించాం. సీజన్లో ఎంపిక చేసిన మోడళ్లపై కచ్చిత బహుమతి ఉంటుంది. అన్ని విభాగాల్లోనూ కొత్త మోడళ్లు కస్టమర్ల ముందుకు రానున్నాయి. ఎస్ఎల్ఆర్ కెమెరాలకు గిరాకీ ఏటా 20 శాతం పెరుగుతోంది. వెడ్డింగ్ మార్కెట్ ఇందుకు దోహదం చేస్తోంది. సోనీ ఆదాయం 2015-16తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. ప్రధాన మార్కెట్లలో ఒకటైన తెలుగు రాష్ట్రాల వాటా కంపెనీ ఆదాయంలో 15 శాతముంది. మాతృసంస్థకు సోనీ ఇండియా టాప్-5 మార్కెట్లలో ఒకటి. రెండు మూడేళ్లలో దీనిని టాప్-3కి తీసుకెళతాం. ప్రీమియం స్మార్ట్ఫోన్లే.. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్లలో 90% రూ.5-10 వేల ధరలో లభించేవే. ఇన్నోవేషన్‌కు సోనీ పెట్టింది పేరు. ముఖ్యంగా కెమెరా, డిస్ప్లే, బ్యాటరీ లైఫ్, కస్టమర్ల అనుభూతిలో కంపెనీ ఉత్పాదనలు ఎప్పుడూ ముందుంటాయి. పరిశోధన, అభివృద్ధికి భారీగా వ్యయం చేస్తున్నాం. అందుకే మా ఉత్పత్తులు ఖరీదైనవి. స్మార్ట్ఫోన్ల విషయంలో రూ.20 వేలు ఆపై విభాగంలోనే పోటీ పడతాం. ఈ సెగ్మెంట్లో కంపెనీ మొబైళ్లకు మంచి ఆదరణ ఉంది. ఇటీవల విడుదల చేసిన ఎక్స్‌పీరియా ఎక్స్ఏ అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌కు డిమాండ్ ఉంది. ఇక ల్యాప్‌టాప్‌ల వ్యాపారం నుంచి సోనీ తప్పుకోవడం ఒక కస్టమర్‌గా చింతిస్తున్నాను. -
ప్రీమియం ఫోన్లదే హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ప్రీమియం స్మార్ట్ఫోన్ల హవా నడుస్తోంది. రూ.30 వేలకుపైగా ఖరీదున్న ప్రీమియం మోడళ్ల అమ్మకాలు ఏకంగా రెండింతలపైగా వృద్ధి నమోదు చేస్తున్నాయి.దీన్నిబట్టి చూస్తే భారతీయులకు గ్యాడె్జట్లపట్ల ఉన్న ఆసక్తి ఇట్టే అర్థమవుతోంది. ప్రధానంగా 35 ఏళ్ల లోపున్న యువత ఇటువంటి ఖరీదైన మోడళ్లకు ఆకర్షితులవుతున్నారు. మార్కెట్లోకి కొత్త మోడల్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవారూ లేకపోలేదు. మార్కెట్ రిసెర్చ్ కంపెనీ జీఎఫ్కే అధ్యయనం ప్రకారం దేశంలో స్మార్ట్ఫోన్ల పరిమాణం 3.3 కోట్ల యూనిట్లు. ఇందులో ప్రీమియం విభాగం వాటా విలువ పరంగా చూస్తే 25 శాతం, పరిమాణం పరంగా 20 శాతం ఉందని సోని ఇండియా మార్కెటింగ్ హెడ్ తడటో కిముర తెలిపారు. రూ.44,990 ధర కలిగిన ఎక్స్‌పీరియా జడ్1 స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారమిక్కడ ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రీమియం ఫోన్ బ్రాండ్‌గా.. మొబైల్ ఫోన్లను ప్రీమియం బ్రాండ్‌గా నిలపడమే సంస్థ తొలి ప్రాధాన్యత అని సోని వెల్లడించింది. ఎక్స్‌పీరియా జడ్ ఆవిష్కరణతో బ్రాండ్ ఇమేజ్ బలపడిందని తెలిపింది. రూ.30 వేలపైన ఖరీదున్న అయిదు రకాల మోడళ్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో సోని ఎక్స్‌పీరియా వాటా 10 శాతముంది. 2013-14లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 20 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నామని, వచ్చే ఏడాది మార్చికల్లా తొలి స్థానం సాధిస్తామని కిముర అన్నారు. హిట్ మోడల్స్‌నే ప్రవేశపెడతామని చెప్పారు.