‘‘నేను విజువల్ ఎఫెక్ట్ జాబ్ చేస్తూ, ఆ తర్వాత సినిమా నిర్మాణంలోకి వచ్చాను. వీలైనన్ని కొత్త కథల్ని ప్రేక్షకులకు చెప్పాలనుకున్నాను... అది కమర్షియల్ అయినా, ఆర్ట్స్ వరల్డ్‌లో అయినా. అలాగే ఒక నటుడిగా నేను కొత్త పాత్రలు, ప్రయోగాత్మక సినిమాలు చేయాలనుకున్నాను. కమర్షియల్, యాక్షన్, అడ్వంచరస్, మైథాలజీ సినిమాలు చేయడం నాకిష్టం’’ అన్నారు రానా. సోనీ టెన్ 4 తెలుగు చానల్‌కి ‘ఫేస్’గా వ్యవహరిస్తున్నారు రానా. ఈ సందర్భంగా ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలోని ముఖ్య విశేషాలు ఈ విధంగా...
► మా నాన్నగారు (నిర్మాత డి. సురేశ్‌బాబు), బాబాయ్ (నటుడు వెంకటేశ్) లకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. స్పోర్ట్స్‌ను బాగా చూస్తారు. అమెరికన్ ఫుట్‌బాల్ లీగ్ చూడటానికి మా నాన్నగారు కొన్నిసార్లు ఉదయం నాలుగు గంటలకే నిద్రలేస్తారు. నా యంగ్ ఏజ్ నుంచీ స్పోర్ట్స్ మీద నాన్న, బాబాయ్‌లకు ఉన్న ఇంట్రస్ట్ చూడటం వల్ల నాకూ ఆసక్తి ఏర్పడింది. స్కూల్ టైమ్‌లో నాకు రెజ్లింగ్ అంటే చాలా ఆసక్తి ఉండేది.
ఇప్పుడు సోనీ వారితో అసోసియేట్ అయి, తెలుగు ప్రేక్షకుల ముందుకు కొత్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్పోర్ట్స్ వ్యాఖ్యానం తెలుగులో కూడా వినిపిస్తుంది. ∙సాధారణంగా మనందరం క్రికెట్‌తో ఎక్కువ కనెక్ట్ అయ్యుంటాం. ఇప్పుడు అన్ని రకాల స్పోర్ట్స్‌కు ఆదరణ పెరుగుతోంది. సినిమా, ఆర్ట్, స్పోర్ట్స్ అనేవి ప్రజలను ఏకం చేస్తాయి. ఎంటర్‌టైన్ చేస్తాయి. గేమ్‌లో ఎవరు గెలుస్తారో మనం ముందే ఊహించి చెప్పలేం. ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారు గెలుస్తారు.
► పెళ్లైన తర్వాత నా జీవితంలో కొత్త ఎనర్జీ వచ్చింది.. స్ట్రాంగ్‌గా ఉన్నాను. పర్సనల్‌గా ఓ మంచి బిగినింగ్. ఇక కరోనా లాక్‌డౌన్ వల్ల వచ్చిన గ్యాప్‌లో చాలా కథలు వినే సమయం కుదిరింది.. ఆసక్తికరమైన కథల్ని ఎంచుకున్నాను. వాటిలో ‘విరాటపర్వం’ ఒక్కటి. ప్రస్తుతం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ షూటింగ్ జరుగుతోంది. ఆ తర్వాత సూపర్ యాక్షన్ హీరో సినిమా చేస్తా.
► సినిమాల ద్వారా ప్రపంచానికి ఎన్నో విషయాలు చెప్పొచ్చు. వేరే భాషల్లో ప్రయోగాత్మక సినిమాలు చేయడం చాలా ఇష్టం. పదేళ్లుగా నేను అదే పనిలో ఉన్నాను. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నాను. ఒక్కో ఇండస్ట్రీలో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను.
► ‘బిగ్‌బాస్’కి హోస్ట్‌గా వెళ్లడం లేదు. ఒక ఫిల్మ్ మేకర్‌గా, ఒక ఆర్టిస్ట్‌గా చూస్తే ఓటీటీలో ప్రేక్షకులు సినిమాని ఎంజాయ్ చేస్తున్నారనిపిస్తోంది. ప్రస్తుత విపత్తు నుంచి ఓ ఆరునెలల్లో బయటపడతామనిపిస్తోంది. ఓటీటీ వచ్చాక కొత్త కథలకు అవకాశం ఉంటోంది. థియేటర్స్‌లో పెద్ద సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్స్, స్టార్స్ సినిమాలు వస్తుంటాయి. ఎక్కువగా డ్రామా అన్నది ఓటీటీలోకి వెళ్తుంది. ఫోన్‌లో, టీవీలో, థియేటర్లో చూసే కథలు వేర్వేరుగా ఉంటాయి. థియేటర్ అనేది పెద్ద అనుభూతిని పంచే ప్రదేశం. అందులోని క్వాలిటీ, సౌండ్ సిస్టమ్స్ మంచి అనుభూతిని ఇస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల వల్ల థియేటర్స్‌కి కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ కొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుంది.
అభిరామ్ (రానా తమ్ముడు) నటుడిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు. వాడి ప్రయాణం వాడిది. ఇది చెయ్, అది చెయ్, ఇలా వెళ్లు, అలా వెళ్లు.. అని మా ఇంట్లో చెప్పడం ఉండదు. ఏ పని చేసినా హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతామని నమ్ముతాం. వాడి బలం ఏంటో ప్రేక్షకులే చెప్పాలి. కచ్చితంగా తను కష్టపడి పని చేస్తాడనే నమ్మకం ఉంది. మా ఫ్యామిలీ ఆర్టిస్టులతో ‘మనం’ లాంటి సినిమా కాదు కానీ కొత్త జోనర్‌లో సినిమా ఉంటుంది.
‘ఆర్‌ఆర్‌ఆర్’ మేకింగ్ వీడియో చూశాను. అద్భుతంగా ఉంది. రాజమౌళిగారి విజన్, ఆలోచనలు చాలా పెద్దవిగా ఉంటాయి. ఎన్టీఆర్, రామ్‌చరణ్.. రాజమౌళి... మంచి కాంబినేషన్. తెలుగు ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఎగై్జటింగ్‌గా ఎదురు చూస్తున్నారు.
పదేళ్లుగా ఆ పనిలోనే ఉన్నా!
Published Thu, Jul 22 2021 12:08 AM | Last Updated on Thu, Jul 22 2021 12:08 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment