
లాక్‌డౌన్ వేళ ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ‘కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ) మన కోసం’ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థకు పలువురు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారు. తాజాగా ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సీసీసీ ట్రస్ట్‌కు సాయం అందించేందకు ముందుకు వచ్చారు. సీసీసీకి రూ. 3 లక్షల విరాళం అందజేయనున్నట్టు ఆయన శుక్రవారం ప్రకటించారు.
కాగా, సీసీసీ సంస్థకు చిరంజీవి చైర్మన్‌గా ఉండగా.. సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్ శంకర్, సీ కల్యాణ్, దాము సభ్యులుగా ఉన్నారు. సీసీసీ ద్వారా 24 క్రాప్ట్స్‌లో పనిచేస్తున్న నిరుపేద సినీ కార్మికులకు నిత్యావసరాలు, ఇతర సాయం అందజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment