ప్రపంచ దేశాలు ఉక్రెయిన్- రష్యా యుద్ధం గురించే చర్చించుకుంటున్నాయి. యూరప్ దేశాల్ని రూల్ చేయాలనే కాంక్షతో రష్యా చేస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్ గెలవాని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు. అదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి చర్చించుకోవడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఆ ఎన్నికల్లో స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌ను అమెరికన్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకుందామానే పోల్ నడుస్తోంది.
@elonmusk Run for President 2024
— J. Sibrian (@JlSibrian) March 6, 2022
The entire World need you !!
ఉక్రెయిన్-రష్యా దేశాల సంక్షోభం సమయంలో ఎలన్ మస్క్ వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో కమ్యూనికేషన్ వ్యవస్థ స‍్తంభించి పోవడంతో ఆదేశ ప్రజల్ని ఆదుకునేందుకు ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. యుద్ధంతో ధ్వంసమైన ఉక్రెయిన్ కు చెందిన నగరాల్లో శాటిలైట్ ఇంటర్నెట్‌ను అందిస్తామని హామీ ఇచ్చారు.
Still feel like @elonmusk should run for President.
— Presley Johnson (@Presley39873110) March 6, 2022
ఈ యుద్ధం ఓ రకంగా ఎలన్ మస్క్‌కు లాభాల్ని తెచ్చిపెట్టేదనే చెప్పుకోవాలి. రష్యా-ఉక్రెయిన్ వివాదం కారణంగా ఇతర దేశాలతో పాటు అమెరికాలో చమరు,గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. ఈ సమయంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ డిమాండ్ ఏర్పడింది. డిమాండ్‌కు అనుగుణంగా ఎలన్ మస్క్ బిజినెస్ చేసి ఉంటే భారీ ఎత్తున లాభాల్ని గడించే వారు. కానీ ఎలన్ మాత్రం లాభపేక్షకు పోకుండా అమెరికా తక్షణమే చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని మస్క్ ట్వీట్ చేశారు. దీంతో పాటు తదితర అంశాలు ఎలన్ మస్క్‌ను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడిని చేద్దామనే స్థాయిలో ట్విట్టర్‌లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment