Cooking Oil Price Hike in February Over The Russia-Ukraine Conflict - Sakshi
Sakshi News home page

సామాన్యులకు భారీ షాక్‌, వంట నూనె రేట్లు మరింత పైపైకి!

Mar 30 2022 1:50 PM | Updated on Mar 31 2022 8:58 AM

Cooking Oil Prices Rise In February Over Russia Ukraine Conflict - Sakshi

సామాన్యులకు భారీ షాక్‌, భారత్‌లో కొనసాగనున్న వంట నూనె మంటలు!

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో మన దేశంలో వంట నూనెల ధరలు గతంలో ఎన్నడూ లేని రోజు రోజుకీ ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌ - రష్యా సంక్షోభం ప్రారంభమైన ఫిబ్రవరి నెల నుంచి భారత్‌లో వంట నూనెల ధరలు అంతకంతకూ పెరుగుతున్నట్లు రిటైల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ బిజోమ్ డేటా తెలిపింది. బ్రాండెడ్ సన్‌ ఫ్లవర్, వనస్పతి, ఆవాలు, వేరుశెనగ నూనె ధరలు పెరుగుతున్నాయని, రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది.  

రష్యా - ఉక్రెయిన్‌ దేశాలు
సన్‌ఫ్లవర్ ఆయిల్ సరఫరా చేసే ప్రధాన దేశాలలో ఉక్రెయిన్, రష్యా దేశాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వంట నూనెల రవాణా చేస్తూ డిమాండ్‌ను తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రెండు దేశాలు ప్రతి ఏడాది భారత్‌కు  2.5 నుంచి 3 మిలియన్ టన్నుల సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ దిగుమతి చేస్తున్నాయి. ఇందులో దాదాపు 70% ఉక్రెయిన్ నుండి వస్తుందని రాయిటర్స్ నివేదిక తెలిపింది. ఇలా మొత్తంగా ఉక్రెయిన్, రష్యాలు కలిసి గతేడాది ఎడిబుల్ ఆయిల్ ను 1.6 మిలియన్‌ టన్నులను సరఫరా చేస్తూ.. దిగుమతుల్లో దాదాపు 13% వాటాను కలిగి ఉన్నాయి. 

అయితే ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న కారణంగా భారత్‌లో వంట నూనెల ధరలు రికార్డ్‌ స్థాయిలో పెరిగినట్లు బిజోమ్‌ అంచనా వేసింది. దేశంలోని 7.5 మిలియన్ల రిటైల్ అవుట్‌లెట్లలో ప్యాక్ చేసిన  వినియోగ వస్తువుల విక్రయాల ఆధారంగా ప్యాకేజ్డ్ సన్‌ ఫ్లవర్ ఆయిల్ ధరలు ఫిబ్రవరిలో వరుసగా 4% పెరిగాయి. అయితే మస్టర్డ్ ఆయిల్ 8.7%, సోయాబీన్ నూనె ధరలు స్వల్పంగా 0.4% తగ్గగా, వనస్పతి 2.7% పెరిగింది. వేరుశెనగ నూనె 1% పెరగ్గా.. భారతీయ గృహాలలో విస్తృతంగా వినియోగించే పామాయిల్ ధరలు 12.9% తగ్గాయి. ఫిబ్రవరి 2020తో పోలిస్తే పామాయిల్ ధరలు ఇప్పటికీ 22.9% పెరిగాయి.  

కొంచెం సర్ధుబాటు 
భారతదేశంలో ఎడిబుల్ ఆయిల్ ధరలు సెప్టెంబరు, డిసెంబర్ త్రైమాసికం మధ్య కొంత దిద్దుబాటుకు గురయ్యాయి. జనవరి నెలలో బిజోమ్ డేటా ప్రకారం.. గత రెండు సంవత్సరాల గరిష్ట స్థాయి నుండి ధరలను 10-30% సడలింపుగా సూచించింది. అయినప్పటికీ, ఫిబ్రవరి నెల చివరలో ఉక్రెయిన్‌లో జరిగిన వివాదం వంట నూనెతో సహా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేలా ఒత్తిడి తెచ్చింది. ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా గత రెండు త్రైమాసికాలుగా ఎడిబుల్ ఆయిల్ ధరలు కొంత స్థిరత్వాన్ని కనబరుస్తున్నాయని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆ ధోరణిని మార్చడానికి దారితీసిందని బిజోమ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అక్షయ్ డిసౌజా అన్నారు.

మార్చిలో రిలీజ్‌ కానీ డేటా 
ఎడిబుల్ ఆయిల్ ధరలు సంవత్సరానికి 15-20% పెరిగాయని, మార్చి 17న విడుదల చేసిన ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ట్రాకర్ నివేదిక బీఎన్‌పీ పారిబాస్ ఇండియా హెడ్ కునాల్ వోరా తెలిపారు. చాలా ఎడిబుల్ ఆయిల్స్ ధరలు ఇప్పటికీ ప్రీ-కోవిడ్ స్థాయిలు. ప్రీ-కోవిడ్ కాలంతో పోలిస్తే లేదా ఫిబ్రవరి 2020, ఉదాహరణకు, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర 50%, వనస్పతి నూనె 58% పెరిగింది, సోయాబీన్ నూనె దాదాపు 20% పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement