‘అమెరికా ఉపాధ్యక్షుడు’ మైక్ పేన్స్తో కేటీఆర్.. | TS minister KTR reveals his photo with US deputy president nominy Mike Pence | Sakshi
Sakshi News home page

‘అమెరికా ఉపాధ్యక్షుడు’ మైక్ పేన్స్తో కేటీఆర్..

Published Wed, Nov 9 2016 3:17 PM | Last Updated on Fri, Aug 24 2018 6:41 PM

‘అమెరికా ఉపాధ్యక్షుడు’  మైక్ పేన్స్తో కేటీఆర్.. - Sakshi

‘అమెరికా ఉపాధ్యక్షుడు’ మైక్ పేన్స్తో కేటీఆర్..

అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు మైక్ పేన్స్ తో తెలంగాణ మంత్రి కేటీఆర్..

హైదరాబాద్: ఇకపై ఆయనను కలవాలుసుకోవాలంటే కొద్దిగా కష్టపడాల్సిందే. అవును. అమెరికా ఎన్నికల ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రభంజనంలో కీలక పాత్రధారి, ట్రంప్ సహచరుడు, అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు మైక్ పేన్స్ అపాయింట్మెంట్ అంత తేలికైనా వ్యవహారమేమీ కాదు. ఈ తరుణంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారాకరామారావు(కేటీఆర్).. మైక్ పేన్స్ తో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. 

మంత్రి కేటీఆర్ ఈ ఏడాది మే చివరి వారంలో అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలను వివరిస్తూ పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఆయన.. మే 25-25 తేదీల్లో ఇండియానా గవర్నర్ మైక్ పేన్స్ ను కలుసుకున్నారు(అప్పటికే పేన్స్ రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఖరారయ్యారు) ఇండియానా రాష్ట్ర రాజధాని ఇండియానా పోలీస్, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాలను అనుసంధానం చేసే ’సిస్టర్ సిటీస్ కమ్యూనిటీ’లో భాగంగా కీలక అంశాలపై ఇరువురూ చర్చించారు. నాటి సమావేశానికి సంబంధించిన ఫొటోలను కేటీఆర్ బుధవారం తన ట్విట్టర్ అకౌంట్లో రీపోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ కు, ఉపాధ్యక్షుడు మైక్ పేన్స్ కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ’ప్రపంచమంతా కొన్ని గంటలుగా ఉత్సుకతతో ఊగిపోతోంది. అమెరికాలో ట్రంఫ్ థండర్.. ఇండియాలో మోదీ సంచలన నిర్ణయం.. ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపర్చింది. మున్ముందు కూడా ఇలాంటి స్వీట్ షాక్ లు తప్పక చవిచూడాల్సిఉంటుంది’అని కేటీఆర్ పేర్కొన్నారు. రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, ఆయన సహచరుడు మైక్ పేన్స్ విజయంతో అమెరికా, భారత్ ల బంధం మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement