వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోకపోతే ఆయనతో తాను డిబేట్(అధ్యక్ష అభ్యర్థుల ముఖాముఖి)లో పాల్గొనబోనని డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా బరిలోకి దిగుతున్న జో బైడెన్ స్పష్టం చేశారు. ఈ నెల 15వ తేదీన ట్రంప్-బైడెన్‌ల రెండో డిబేట్ జరగాల్సి ఉంది. ఈక్రమంలో ఇవాళ బైడెన్ కీలక ప్రకటన చేశారు. 'పూర్తిస్థాయి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ రెండో డిబేట్‌ను నిర్వహించాలనుకున్నాం. కానీ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి చూస్తే ఇప్పుడు డిబేట్ నిర్వహించకపోవడమే మేలు అనిపిస్తోంది' అని ఆయన అన్నారు. కోవిడ్ నుంచి ట్రంప్ పూర్తిగా కోలుకోని పక్షంలో అసలు డిబేట్ నిర్వహించడం సరికాదని బైడెన్ అభిప్రాయపడ్డారు.
(చదవండి: డిబేట్ తర్వాత పెరిగిన బైడెన్ ఆధిక్యం!)
మూడు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ట్రంప్ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిస్థాయిలో మెరుగుపడిందని వైద్యులు కూడా ధ్రువీకరించారు. మయామీలో జో బైడెన్‌తో రెండో డిబేట్‌కు తాను రెడీగా ఉన్నానని ట్రంప్ సైతం ప్రకటించారు. కానీ.. ట్రంప్ సలహాదారులు, అధికారుల్లో చాలామందికి కోవిడ్ సోకింది. డిబేట్‌లో వాళ్లు కూడా పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండో డిబేట్ నిర్వహణపై సస్పెన్స్ నెలకొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టమైన అధ్యక్ష అభ్యర్థుల ముఖాముఖి పలు దఫాలు జరుగుతుంది. తొలి డిబేట్ సెప్టెంబర్ 30న జరిగింది.
(చదవండి: ట్రంప్ మరో ప్రధాన సలహదారుడుకి పాజిటివ్)
Comments
Please login to add a commentAdd a comment