ట్రంప్ విజయంపై దిగ్భ్రాంతి.. ఆగ్రహం | Shock, anger to congratulations flood Twitter on Trump win | Sakshi
Sakshi News home page

ట్రంప్ విజయంపై దిగ్భ్రాంతి.. ఆగ్రహం

Published Wed, Nov 9 2016 3:55 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

ట్రంప్ విజయంపై దిగ్భ్రాంతి.. ఆగ్రహం - Sakshi

ట్రంప్ విజయంపై దిగ్భ్రాంతి.. ఆగ్రహం

రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ అమెరికా ఎన్నికల్లో విజయం సాధించడంపట్ల సామాజిక మీడియాలో ఆసక్తికరమైన ప్రతిస్పందనలు వెలువడ్డాయి.

న్యూయార్క్: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ అమెరికా ఎన్నికల్లో విజయం సాధించడంపట్ల సామాజిక మీడియాలో ఆసక్తికరమైన ప్రతిస్పందనలు వెలువడ్డాయి. ట్రంప్ విజయాన్ని చూసి కొంతమంది విస్మయానికి మరికొందరు దిగ్బ్రాంతికి గురైనట్లు చెప్పగా ఇంకొందరు మాత్రం గొప్ప విజయం అని అభివర్ణించారు. 'నేను ఇప్పటికీ షాక్లోనే ఉన్నాను' అంటూ నైలా అహ్మద్ అనే వ్యక్తి ట్వీట్ చేయగా.. ఇది చాలా గొప్ప విజయం.. దీని తర్వాత నేను ఎంతో ఎత్తులో ఉన్నట్లు అనిపిస్తోంది అంటూ మరో వ్యక్తి ట్వీట్ చేశాడు.

ఇక దక్షిణాఫ్రికా నుంచి డీజే బుసాంగ్ అనే ట్విట్టర్ర్ యూజర్ స్పందిస్తూ ట్రంప్ సాధించిన విజయాన్ని సెప్టెంబర్ 11 దాడితో పోల్చాడు. మరోనాలుగేళ్లపాటు అమెరికా దెయ్యాల పండుగ(హలోవీన్) జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లుందని ఇంకొందరు వ్యాఖ్యానించారు. అమెరికా ఏ విధంగా పతనం అవుతుందో అని భయమేస్తుందని, తామంతా చచ్చిపోతామా అన్న ఆందోళన పుడుతోందని కూడా ఇంకొందరు ట్వీట్లు చేశారు. అసలు ట్రంప్కు అభినందనలు తెలియజేయాలంటేనే కోపం వస్తుందని మరికొందరు స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement