న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలుపొందారు. పెన్సెల్వేనియాలో తుది ఫలితం ప్రకటించడంతో జో బిడెన్ గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు. పెన్సెల్వేనియాలో మొత్తం 20 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. అక్కడ జో బైడెన్ ఆధిక్యం కనబర్చడంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితంపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. జో బైడెన్ కు మొత్తం 284 ఎలక్టోరల్ ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది. 538 ఎలక్టోరల్ ఓట్లలో మెజారీటికి కావాల్సిన 270 ఎలక్టోరల్ ఓట్లను బైడెన్ దాటేయడంతో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
కాగా నార్త్ కరోలినా ఫలితం తేలకపోవడంతో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితమైనట్లు తెలుస్తుంది. దీంతో.. 46వ అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ కూడా విజయం సాధించారు. కాగా అమెరికాకు ఎన్నికైన తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు.(చదవండి : ట్రంప్ నుంచి చేజారిపోతున్న పెన్సిల్వేనియా)
Comments
Please login to add a commentAdd a comment