ప్రపంచ చరిత్రలో ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ఎవరు గెలుస్తారు అనే దానిపై ఆసక్తి నెలకొన్నది. ట్రంప్, జో బిడెన్ ఇద్దరు మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరలో ఉన్నారు. ఇద్దరిలో విజేత ఎవరన్నది చెప్పడం కొంచెం కష్టంగా మారింది. మ్యాజిక్ ఫిగర్ 270కి ఇద్దరు దగ్గరగా ఉండడంతో ఉత్కంఠ వాతావారణం నెలకొంది. ఇలాంటి సందర్భంలో అమెరికా అధ్యక్ష ఎన్నికపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. (చదవండి : అమెరికా అధ్యక్ష ఫలితాలపై ఎందుకు ఆసక్తి?)
'ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే మాత్రం ఒక వ్యక్తి పాపులర్ అవుతారు. ట్రంప్ గెలుస్తాడని ఆ జ్యోతిష్యుడు ముందుగానే చెప్పాడని, ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా, చివరికి గెలిచేది ట్రంపే అని జోతిష్యుడు చెప్పాడు. అయితే ట్రంప్‌కు జో బిడెన్ నుంచి గట్టి పోటీ ఉంటుందని అయినా ట్రంప్ గెలుస్తాడని ఆ జోతిష్యుడు ధీమా వ్యక్తం చేశాడు. అయితే నేను ఇప్పుడు ఆ జ్యోతిష్యుడు పేరును చెప్పదలచుకోలేదు. కానీ ఆ జోతిష్యుడు గీసిన జోతిష్యం మాత్రం మీ ముందు ఉంచుతున్నా అంటూ' ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ జ్యోతిష్యుడు ఎవరో కానీ ట్రంప్‌పై వేసిన జోతిష్యం నిజమవుతుందో లేదో చూడాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
This astrologer’s forecast was doing the messaging circuit last week. (Have concealed the name & address for the sake of privacy) If President Trump retains office, this astrologer will be rather popular, to put it mildly. 😊 pic.twitter.com/m2H4jFRBQ3
— anand mahindra (@anandmahindra) November 4, 2020
Comments
Please login to add a commentAdd a comment