వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‍పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైట్‌హౌస్ మాజీ ఫిజీషియన్ రోనీ జాక్సన్. ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారని ఆరోపించారు. బైడెన్ అధ్యక్ష కాలాన్ని పూర్తి చేసుకోలేక మధ్యలోనే వైదొలుగుతారని జోస్యం చెప్పారు.
బైడెన్ మైండ్ ఎక్కడికో వెళ్లిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రోనీ. ఆయన పదవీ కాలన్ని పూర్తి చేసుకోలేరని అందరికీ తెలుసని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఇంకా ఎక్కువ సమయం వేచి చూడకూడదని, బైడెన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పలువురు అమెరికా మాజీ అధ్యక్షులకు వ్యక్తిగత ఫిజీషియన్‍గా సేవలందించారు రోనీ. బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, జార్జ్ డబ్ల్యూ బుష్ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.
అయితే బైడెన్‌పై తాను చేసిన వ్యాఖ్యలు చూసి బరాక్ ఒబామా తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఓ మీడియా ఛానల్‍కు రోని వెల్లడించారు. శ్వేతసౌధంలో గొప్ప బాధ్యతలు నిర్వహించి ఇలా అమర్యాదగా ప్రవర్తించడం సబబు కాదన్నారని చెప్పారు. రోనీ ప్రస్తుతం టెక్సాస్ నుంచి అమెరికా ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
చదవండి: ఎన్నో దేశాలను సాయం అడిగాం.. భారత్ మాత్రమే ఆదుకుంది
Comments
Please login to add a commentAdd a comment