ఎన్నికల వేళ అమెరికాపై ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందటూ ప్రముఖ మీడియా సంస్థ శుక్రవారం బాంబు పేల్చింది. అధికారులంతా ఎన్నికల నిర్వహణలో తనమునకలైనవేళ అల్ కాయిదా ఉగ్రవాదులు దాడులకు దిగబోతున్నారని కొలంబియా బ్రాడ్ కాస్టింగ్ సిస్టం(సీబీఎస్) శుక్రవారం ఒక రిపోర్టును ప్రచురిచంది. దీంతో అగ్రరాజ్యం ఉలిక్కిపడ్డట్లైంది.