కమలా హారిస్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న పాకిస్థాన్–అమెరికన్లు, ట్రంప్ ప్రత్యర్థి అయిన డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు ఓటు వేయాలనుకుంటున్నారు. వలసవాదులకు, మైనారిటీలకు, మహిళలకు ట్రంప్ వ్యతిరేకం కనుక వారు బైడెన్‌కు ఓటు వేయాలనుకుంటున్నారు. అయితే అదే డెమోక్రట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తోన్న సెనేటర్ కమలా హారిస్‌కు ఓటు వేసే విషయంలో పాకిస్థాన్–అమెరికన్లు సంశయం వ్యక్తం చేస్తున్నారు.
అందుకు కారణం కమలా హారిస్ ఆఫ్రికన్–అమెరికన్ అవడం ఒకటైతే, మరోటి ఆమె తల్లి భారతీయ మహిళ అవడం. భారత్ విషయంలో ముఖ్యంగా కశ్మీర్ అంశం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిని కమలా హారిస్ సమర్థించే అవకాశం ఉందన్నది పాక్–అమెరికన్ల ఆందోళన. వాస్తవానికి అమెరికా మాజీ ఉపాధ్యక్షుడైన జో బైడెన్, కశ్మీర్ విషయంలో 370 అధిరణాన్ని రద్దు చేయడాన్ని, పౌరసత్వ సవరణ బిల్లును తీసుకురావడాన్ని వ్యతిరేకించారు. ఆయన పట్ల వ్యక్తం చేయని అభ్యంతరాలను పాక్–అమెరికన్లు ఎక్కువగా కమలా హారిస్ విషయంలో వ్యక్తం చేస్తున్నారు. అందుకు ప్రధాన కారణం కశ్మీర్ విషయంలో ఆమె నేరుగా జోక్యం చేసుకోవడమే.
‘ప్రపంచంలో కశ్మీరీలు ఎప్పటికీ ఒంటరి వారు కాదు, వారి సమస్యలను మేము ఎప్పటికప్పుడు తెలసుకుంటూనే ఉన్నాం’ కమలా హారిస్ వ్యాఖ్యానించడం పట్ల పాక్–అమెరికన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్ విషయంలో పాక్ వైఖరిని ఆమె సమర్థించాలిగానీ కశ్మీర్ స్వతంత్రాన్ని కాదన్నది వారి వాదన. (అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికన్లందరికీ ఉచితంగా కరోనా వాక్సిన్)
Comments
Please login to add a commentAdd a comment