హాలీవుడ్ నటుల్ని వణికిస్తున్న ట్రంప్ | Donald Trump's victory stumps Hollywood | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ నటుల్ని వణికిస్తున్న ట్రంప్

Published Wed, Nov 9 2016 5:09 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

హాలీవుడ్ నటుల్ని వణికిస్తున్న ట్రంప్ - Sakshi

హాలీవుడ్ నటుల్ని వణికిస్తున్న ట్రంప్

రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సాధించిన విజయం కొంతమంది హాలీవుడ్ నటుల్లో భయం పుట్టిస్తోంది.

లాస్ ఎంజెల్స్: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సాధించిన విజయం కొంతమంది హాలీవుడ్ నటుల్లో భయం పుట్టిస్తోంది. ముఖ్యంగా ఖేర్, క్రిస్ ఇవాన్స్ వంటి నటులు ట్రంప్ విజయంపట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే భయపడుతున్నామని, ట్రంప్ గెలిచాడన్న విషయాన్ని నమ్మలేకపోతున్నామని చెప్పారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ను ఓడించి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ప్రచార సమయంలో హాలీవుడ్లోని చాలామంది నటులంతా హిల్లరీకే బహిరంగంగా మద్దతు ప్రకటించారు.

కానీ, ఎన్నికల ఫలితాలు తారుమారవ్వడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. క్రిస్ ఇవాన్స్ అనే హాలీవుడ్ నటుడు స్పందిస్తూ ఇది అమెరికాకు చాలా కలవరాన్ని పుట్టించిన రాత్రి అన్నారు. విద్వేషాలను ప్రోత్సహించే ఓ వ్యక్తికి తమ గొప్ప దేశాన్ని అప్పగించాల్సి వచ్చిందన్నారు. జెస్సీ టైలర్ ఫెర్గూసన్ అనే నటుడు స్పందిస్తూ ముస్లింలు, మహిళలు, వలసదారులు, ఎల్జీబీటీ కమ్యునిటీ విషయంలో తాను విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. కానీ, భవిష్యత్తులో వారి తరుపున పోరాడేందుకు తాను సిద్ధమని అన్నారు. ఖెర్ అనే మ్యూజిక్ ఆర్టిస్టు స్పందిస్తూ 'ట్రంప్ అసలు ఈ విజయం సాధించాడు? అతడిని జైలులో వేసి తాళం పడేయాలి. అమెరికాలో ఈ రాత్రిని మించిన హాస్యం మరొకటి లేదు' అని అన్నారు. అలాగే, అలెక్ బల్ద్విన్, బ్యూ విల్లీమాన్, షోండా రైమ్స్ కూడా ట్రంప్ విజయం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement